JC: మట్టి వినాయకుడినే పూజిద్దాం
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:13 AM
వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన జిల్లాలో వినాయక మండపాల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, విద్యుత, పంచాయతీ, మున్సిపల్ శాఖాధికారులతో సమీక్షించారు.
జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్
పుట్టపర్తి టౌన, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన జిల్లాలో వినాయక మండపాల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, విద్యుత, పంచాయతీ, మున్సిపల్ శాఖాధికారులతో సమీక్షించారు. మట్టి వినాయకుల తయారీని ప్రోత్సహించాలన్నారు. పర్యావరణానికి హాని కలగని విధంగా వినాయక చవితి పండుగను ప్రజలు జరుపుకోవాలని సూచించారు. అధికారులు కూడా పీస్ కమిటీలు ఏర్పాటు చేసి, పర్యవేక్షించాలని ఆదేశించారు. సుప్రీంకోర్డు, నేషనల్ గ్రీన ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా మట్టి విగ్రహాల తయారీ, నిమజ్జనం జరగాలన్నారు. అనంతరం మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరాణాన్ని రక్షిద్దాం అన్న పోస్టర్లును జేసీ అవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు సువర్ణ, వీవీఎ్‌సశర్మ, డీపీఓ సమత, డీఎస్పీ విజయకుమార్, మున్సిపల్ కమిషనర్లు క్రాంతికుమార్, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.