BJP: స్వదేశీ వస్తువులనే వాడుదాం
ABN , Publish Date - Oct 28 , 2025 | 10:28 PM
ఆత్మనిర్భర్ భా రత కార్యక్రమంలో భాగంగా ప్రతిఒక్కరూ, ప్రతి ఇంటా స్వదేశీ వస్తువులనే వాడుదాం అంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ పిలుపునిచ్చారు. ఆయన ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని వార్డుల్లో, సూపర్‌మార్కెట్లలో స్వదేశీ వస్తువుల వాడకంపై ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. మేక్‌ఇన ఇండియా ఉత్పత్తులనే వాడుదాం, దేశ ఆర్థికవ్యవస్థను బలపరుద్దామంటూ ఆయన పేర్కొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్
పుట్టపర్తి రూరల్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆత్మనిర్భర్ భా రత కార్యక్రమంలో భాగంగా ప్రతిఒక్కరూ, ప్రతి ఇంటా స్వదేశీ వస్తువులనే వాడుదాం అంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ పిలుపునిచ్చారు. ఆయన ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని వార్డుల్లో, సూపర్‌మార్కెట్లలో స్వదేశీ వస్తువుల వాడకంపై ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. మేక్‌ఇన ఇండియా ఉత్పత్తులనే వాడుదాం, దేశ ఆర్థికవ్యవస్థను బలపరుద్దామంటూ ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గడంతో నిత్యావసర వస్తువుల ధర లు తగ్గి సామాన్యులకు మేలు జరిగిందన్నారు. అధిక ధరలు వసూ లు చేసే వారిపై చర్యలు తీసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, అధికార ప్రతినిధి జ్యోతి ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు కళ్యాణ్ కుమార్, నాయకులు సురేంద్రబాబు, రామాంజినేయులు, నారాయణ, బాలగంగాధర్, మేదర శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....