Share News

JSREE RAM: మొక్కలు నాటి సంరక్షిద్దాం

ABN , Publish Date - Jun 05 , 2025 | 11:56 PM

ప్రతి ఒక్కరూ మొక్కలను విరివిగా నాటి వాటిని సంరక్షించాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ పిలుపునిచ్చారు. లేదంటే భవిష్యత్తులో స్వచ్చమైన గాలిని కూడా డబ్బుపెట్టి కొనే పరిస్థితి వస్తుందన్నారు.

JSREE RAM: మొక్కలు నాటి సంరక్షిద్దాం
Paritalasreeram who planted sapling in MPDO office premises

- టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌

ధర్మవరంరూరల్‌, జూన 5(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ మొక్కలను విరివిగా నాటి వాటిని సంరక్షించాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ పిలుపునిచ్చారు. లేదంటే భవిష్యత్తులో స్వచ్చమైన గాలిని కూడా డబ్బుపెట్టి కొనే పరిస్థితి వస్తుందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో అధికారులు టీడీపీ నాయకులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టా రు. ఈ కార్యక్రమానికి హాజరైన పరిటాలశ్రీరామ్‌ మొక్కలు నాటి నీరుపోశారు.

ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పనిచేయాలి

గ్రామాల్లో కూలీలందరికీ పనులు కల్పించాలని ఉపాధి హామీ పథకం సిబ్బందికి పరిటాలశ్రీరామ్‌ సూచించారు. ఉపాధి హామి ద్వారా ప్రభుత్వం చేపడుతున్న ఎన్నో కార్యక్ర మాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల న్నారు. ఆయన గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ ద్వా రా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అక్రమాలకు పాల్పడి ప్రభుత్వా నికి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాయిమనోహర్‌, ఏపీఓ సుధాకర్‌, ఈసీ అరుణ, కార్యాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 05 , 2025 | 11:56 PM