BJP : విజయవంతం చేద్దాం
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:15 PM
అనంతపురంలో బుధవారం నిర్వహించే సూపర్‌సిక్స్- సూపర్‌హిట్ బహిరంగ సభను చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు తెలి పారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ధర్మవరం, ధర్మవరం రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లోని బీజేపీ కార్యాల యాల్లో మంగళవారం పార్టీశ్రేణులతో సమావేశాన్ని నిర్వహించారు.
బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు
ధర్మవరం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో బుధవారం నిర్వహించే సూపర్‌సిక్స్- సూపర్‌హిట్ బహిరంగ సభను చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు తెలి పారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ధర్మవరం, ధర్మవరం రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లోని బీజేపీ కార్యాల యాల్లో మంగళవారం పార్టీశ్రేణులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశా ల్లో హరీశబాబు మాట్లాడుతూ... సీఎం సభను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సూపర్‌హిట్ సభ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మైలురాయి కానుందన్నారు. కేంద్రం మద్ధతుతో రాష్ట్రంలో అమలవుతున్న సూపర్‌సిక్స్ పథకాల ప్రాముఖ్యాన్ని వివరి స్తార న్నారు. కావున సభకు పెద్దఎత్తున హాజరుకావాలని ఆయన కోరారు.
ఓబుళదేవరచెరువు: అనంతపురంలో బుధవారం నిర్వహించే సూపర్ సిక్స్ - సూపర్‌హిట్ సభకు ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఇడగొట్టు వీరాంజనే యులు మంగళవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....