ECO: మట్టి గణపతితో పర్యావరణాన్ని కాపాడుదాం
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:27 AM
మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావర ణాన్ని కాపాడాలని ఆవోపా జిల్లా ఇనచార్జ్ లక్ష్మీనారాయణ, గౌరవాధ్యక్షుడు శీబా నగేశ గుప్త పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవా రం సాయంత్రం ఆవోపా, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పట్టణ వాసులకు పంపిణీచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... అదే రసాయనిక విగ్రహాలువాడితే పర్యావరణానికి ముప్పు వాటిల్లు తుందని పేర్కొన్నారు.
పలువురు వక్తల పిలుపు
ధర్మవరం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావర ణాన్ని కాపాడాలని ఆవోపా జిల్లా ఇనచార్జ్ లక్ష్మీనారాయణ, గౌరవాధ్యక్షుడు శీబా నగేశ గుప్త పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవా రం సాయంత్రం ఆవోపా, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పట్టణ వాసులకు పంపిణీచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... అదే రసాయనిక విగ్రహాలువాడితే పర్యావరణానికి ముప్పు వాటిల్లు తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో డాక్టర్ సుబ్బారావు, వాసవిమహిళా మండలి అధ్యక్షురాలు రూపారాగిణి, అవోపా సభ్యులు పాల్గొన్నారు. అలాగే వివేకానంద డిగ్రీ కళాశాలలో కూడా మట్టి వినాయక ప్రతిమలను ఎనఎస్‌ఎస్ పీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో విద్యార్థినిలకు కళాశాల కరస్పాండెంట్ భాస్కర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ కరణం హర్షవర్దన అందజేశారు.
ముదిగుబ్బ: మండల కేంద్రంలోని శాంతి ఆనంద పాఠశా లలో పర్యావరణ పరిరక్షణకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వినా యక చవితి పర్వదినం సందర్భంగా రసాయనాలతో తయారు చేసే వినాయక ప్రతిమలు వాడకంతో జల కాలుష్యం పెరిగిపోయి పర్యావరణం దెబ్బతింటుందని, దానికి బదులుగా ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను త యారుచేసి విద్యార్థులు స్థానికులకు అవగాహన కల్పించారు. బంకమన్ను తో సహజమైన రంగులతో వినాయకు డిని తయారుచేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలుపుతూ విద్యార్థులు మట్టి ప్రతిమలను తయారుచేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో1 వెంకటచలపతి, ఎంఈఓ - 2 రమణప్ప, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బొగ్గు రాజశేఖర్, సొసైటీ ప్రెసిడెంట్ తుమ్మల చంద్రమోహన తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....