TDP: సూపర్ హిట్ సభను విజయవంతం చేద్దాం
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:17 PM
కూటమి ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో వైసీపీ చే స్తున్న తప్పుడు ప్రచారాలకు ‘సూపర్‌సిక్స్- సూపర్‌హిట్’ సభ ద్వారా సమాధానం చెబుతామని రాష్ట్ర విద్యుత శాఖ మంత్రి గొట్టి పాటి రవికుమార్, అమలాపురం, కనిగిరి ఎమ్మెల్యేలు ఆనందరావు, ఉగ్రనరసింహ, టీడీపీ నియోజక వర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు.
మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు
వైసీపీ చెడు ప్రచారాలకు సమాధారం చెబుదాం
టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్
ధర్మవరం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో వైసీపీ చే స్తున్న తప్పుడు ప్రచారాలకు ‘సూపర్‌సిక్స్- సూపర్‌హిట్’ సభ ద్వారా సమాధానం చెబుతామని రాష్ట్ర విద్యుత శాఖ మంత్రి గొట్టి పాటి రవికుమార్, అమలాపురం, కనిగిరి ఎమ్మెల్యేలు ఆనందరావు, ఉగ్రనరసింహ, టీడీపీ నియోజక వర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. పట్టణంలోని టీడీపీ ఎర్రగుంట కార్యాలయంలో ఆదివారం సాయంత్రం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పరిటాలశ్రీరామ్ అధ్య క్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి గొట్టి పాటి, ఎమ్మెల్యేలు ఆనందరావు, ఉగ్రనరసింహ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీని వాసులు హాజరయ్యారు. మంత్రి రవికుమార్, ఎమ్మెల్యేలు ఆనందరావు, ఉగ్రనరసింహ, పరిటాలశ్రీరామ్‌లను చేనేత ప్రముఖులు సంధారాఘవ, నా యకులు జింకా పురుషోత్తం, కొత్తపేట ఆది, సాయి గజమాలతో సత్కరిం చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...పరిటాల రవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటాపురం వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు. పరిటాల శ్రీరామ్ నాయక త్వంలో ఇక్కడ పార్టీ ఎంత బలంగా ఉందో అర్థమవుతోందన్నారు. జగనరెడ్డి పాలనలో రాష్ట్రం ఏవిధంగా అధ్వానంగా మారిందో అందరికీ తెలుసన్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇచ్చిన మాట ప్రకారం అన్నిపథకాలు అమలు చేస్తున్న నాయకుడు సీఎం చంద్రబాబు అన్నారు. మనం చేసే మంచిని ప్రజలకు చెప్పే అవకాశం వచ్చిందని, నాయకులు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభను విజ యవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ.. మళ్లీమళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రా వాలని ప్రజల అభిప్రాయ పడుతున్నారన్నారు. పరిటాలశ్రీరామ్ మాట్లాడు తూ... ఎవరూ ఊహించని విధంగా 15 నెలల్లో సూపర్‌సిక్స్ హామీలను సీ ఎం చంద్రబాబు అమలు చేశారన్నారు. కానీ వైసీపీ నాయకులు చెడుగా ప్రచారం చేస్తున్నారని, దానిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపు ని చ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీసీడ్స్ రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్ కమతం కాట మయ్య, టీడీపీ నాయకులు చింతలపల్లి మహేశచౌదరి, పరిశే సుధాకర్, సంధా రాఘవ, ఫణికుమార్, నాగూర్‌హుస్సేన, భీమనేని ప్రసాద్‌నాయుడు, పురుషోత్తంగౌడ్, చింతపులుసు పెద్దన్న, రాళ్లపల్లి షరీఫ్ వేణుగోపాల్‌రెడ్డి, మాధవరెడ్డి, కరెంటు ఆది, గొట్లూరుశీన, చట్టా లక్ష్మీనారాయణ, అంబటి సనత, బొట్టు కిష్ట, జింకల రాజన్న, సాయి, రాంపురం శీన, గంగారపు రవి, తలారి చంద్రమోహన, బీరే శీన తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....