MLA: సభను విజయవంతం చేద్దాం
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:39 AM
అనంతపురంలో ఈనెల 10న ని ర్వహించే సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, కందికుంట వెంకటప్రసాద్ పి లుపునిచ్చారు. పట్టణంలోని పీఆర్‌గ్రాండ్‌లో సోమవారం ఎన్డీఏ కూటమి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దూళి పాళ్ల నరేంద్ర మాట్లాడుతూ... రాక్షస పాలనను అంతమొందించి, ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారన్నారు.
ఎమ్మెల్యేలు దూళిపాళ్ల, కందికుంట పిలుపు
కదిరి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో ఈనెల 10న ని ర్వహించే సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, కందికుంట వెంకటప్రసాద్ పి లుపునిచ్చారు. పట్టణంలోని పీఆర్‌గ్రాండ్‌లో సోమవారం ఎన్డీఏ కూటమి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దూళి పాళ్ల నరేంద్ర మాట్లాడుతూ... రాక్షస పాలనను అంతమొందించి, ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారన్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నే రవేర్చిన సందర్భంగా అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ - సూపర్‌హిట్ సభను విజయవంతం చేయాలని కోరారు. ఒక్క ఓటుతో రాష్ట్ర అభివృద్ధిని కోరుకున్న ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్ర భుత్వ పనిచేస్తోందన్నారు. నిత్యం ప్రజలకోసం పనిచేసే ఎమ్మెల్యే కదిరికి ఉండ డంతో ఎంతో మంచిదన్నారు. ఎమ్మెల్యే కందికుంట మాట్లాడుతూ... సీపీఎస్ ను వారంలో రద్దు చేస్తానని మాట తప్పిన, పింఛన్లు పెంచేందుకు ఐదేళ్లు తీసుకున్న జగన్మోహనరెడ్డిని ఇంటికి పంపి, అదే సయమంలో కూటమిపై నమ్మకముంచి అధికారం కట్టబెట్టిన ప్రజల అభివృద్ధే తమ ధ్యేయమన్నా రు. నియోజర్గంలో బలమైన కార్యకర్తలు ఉన్నారని, అవినీతికి పాల్పడ కుండా పార్టీ కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఉద్యోగాలు మొదులుకుని ఏవిషయంలో అయినా సమన్వయంగా పనిచేస్తున్నారన్నారు. పదివేల మం దిని సభకు తరలిస్తామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పా ర్థసారఽథి జనసేన నియోజకవర్గం ఇనచార్జ్ భైరవప్రసాద్, టీడీపీ నాయకు లు పవనకుమార్‌రెడ్డి, పర్వీనాబాను, చైర్‌పర్సన దిల్షాదున్నీషా, వైస్ చైర్మన రాజశేఖరాచారి, బాహుద్దీన, పరిశీలకులు వాజీద్ తదితరులు మాట్లాడారు. కూటమి పార్టీల ఆరు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.