Share News

TDP: సభను సూపర్‌ హిట్‌ చేద్దాం

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:27 AM

అనంతపురంలో ఈనెల 10వ తేదీన జరగబోయే ‘సూపర్‌ సిక్స్‌- సూపర్‌హిట్‌’ సభను విజయవంతం చేద్దామని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ పార్టీ శ్రేణుల కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయన గురువారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశం ని ర్వహించి చర్చించారు.

TDP: సభను సూపర్‌ హిట్‌ చేద్దాం
Paritala Sriram talking to leaders and activists

టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌

ధర్మవరం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో ఈనెల 10వ తేదీన జరగబోయే ‘సూపర్‌ సిక్స్‌- సూపర్‌హిట్‌’ సభను విజయవంతం చేద్దామని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ పార్టీ శ్రేణుల కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయన గురువారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశం ని ర్వహించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో కీలకంగా ఉన్న సూపర్‌సిక్స్‌ను ఏడాది కాలం లో విజయవంతంగా అమలు చేసిన ప్రభుత్వం మనదన్నారు. దీంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.


ఈ ఆనందాన్ని మన జిల్లాలోనే పం చుకోవాలని పార్టీ పెద్దలు నిర్ణయించారన్నారు. ఈ సభకు సంబంధించి న కో ఆర్డినేషన కమిటీలోని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ఏపీఎస్సీ ఫైనాన్స కార్పొరేషన చైర్మన ప్రభాకర్‌, ధర్మవరం అబ్జర్వర్‌ నాగేం ద్రప్ర సాద్‌తో రెండు రోజుల్లో సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఏపీ సీడ్స్‌ రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్‌ కమతం కాటమయ్య, నియోజక వర్గ క్లస్టర్‌ ఇన చార్జ్‌ చింతలపల్లి మహేశచౌదరి, నాయకులు పరిశే సుధాకర్‌, ఫణికు మార్‌, సంధా రాఘవ, పురుషోత్తంగౌడ్‌, నాగూర్‌హుస్సే న, బీరే గోపాల కృష్ణ, రాళ్లపల్లి షరీఫ్‌, గొట్లూరు శీన, మేకల రామాంజినే యులు, గుడిపా టి చంద్ర, అంబటి సనత, పోతుకుంట లక్ష్మన్న, విజయసారఽథి రాంపురం శీన, చిన్నూరు విజయ్‌చౌదరి, పొరాళ్ల రహీం పాల్గొన్నారు.

చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దాలి

ధర్మవరం: చెత్తరహిత పట్టణంగా ధర్మవరాన్ని తీర్చిదిద్దే బాధ్యత అధికారులు, శానిటేషన వర్కర్లు, కార్యదర్శులదేనని టీడీపీ నియోజకవ ర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ పేర్కొన్నారు. ఆయన గురువారం పట్టణం లోని టీడీపీ కార్యాల యంలో గురువారం అధికారులు, శానిటేషన వర్క ర్లు, కార్యదర్శులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ‘మీ సమస్య - మా బాధ్యత’ కార్యక్రమంలో ఎక్కువ భాగం ప్రజల నుంచి శానిటేషనపై ఫి ర్యాదులు వచ్చాయన్నారు. అధికారులు, వర్కర్లు సమన్వయంతో పని చేసి చెత్తరహిత ధర్మవరంగా ఉంచేలా కృషిచేయాలని సూచించారు. శానిటేషన వర్కర్లు, చెత్త సేకరణ వాహనాల సమస్యలను మంత్రి సత్యకుమార్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 05 , 2025 | 12:27 AM