Share News

MLA: ప్లాస్టిక్‌ రహిత పుట్టపర్తిగా మారుద్దాం

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:41 AM

ప్లాస్టిక్‌ రహిత మున్సి పాలిటీగా పుట్టపర్తిని మారుద్దామని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పిలు పునిచ్చారు. ప్లాస్టిక్‌ రహిత పుట్టపర్తిగా మారుద్దామని మునిసిపల్‌ కమి షనర్‌ క్రాంతికుమార్‌ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే గురువారం స్థానిక మునిసిపల్‌ కార్యాలయం వద్ద ఆవి ష్కరించారు.

MLA: ప్లాస్టిక్‌ రహిత పుట్టపర్తిగా మారుద్దాం
MLA releasing poster at municipal office

ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి

పుట్టపర్తి రూరల్‌, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్‌ రహిత మున్సి పాలిటీగా పుట్టపర్తిని మారుద్దామని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పిలు పునిచ్చారు. ప్లాస్టిక్‌ రహిత పుట్టపర్తిగా మారుద్దామని మునిసిపల్‌ కమి షనర్‌ క్రాంతికుమార్‌ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే గురువారం స్థానిక మునిసిపల్‌ కార్యాలయం వద్ద ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పట్టణంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలన్నారు.


పట్టణంలో ఫ్లెక్సీలు, ప్లాస్టిక్‌ కవర్లు, బాటిళ్ల విక్రయాలను నిషేధించేలా ప్రజల్లో మునిసిపల్‌ ఆదికారులు చైతన్యం తీసుకరావాలన్నారు. జనపనార బ్యాగులు, క్లాత బ్యాగుల వాడకంపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌ రత్నప్పచౌదరి, నాయకులు కొత్తపల్లి జయప్రకాష్‌, రామాంజి నేయులు, మునిసిపల్‌ ఏఈ స్వాతి సిబ్బంది పాల్గొన్నారు.

రైతులు కోరిన వెంటనే ఎరువుల సరఫరా

అమడగూరు: రైతులు కోరిన వెంటనే ఎరువులు, యూ రియాను కూటమి ప్రభుత్వం అందిస్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొ న్నారు. ఆమె గురువారం మండలంలోని సీకిరేవులపల్లిలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాసులరెడ్డి సోదరుడు బయ్యారెడ్డి వైకుంఠ సమారాధానకు హాజర య్యారు. అనంతరం ఆమె రైతులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతులకు అవసరమైనంత యూరియా, ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వంపై బురదచల్లడానికి వైసీపీ కుట్ర పన్నుతోందన్నారు. నాయకులు శ్యామ్‌బాబు, శివారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నాగేంద్రకుమార్‌రెడ్డి, కుమార్‌రెడ్డి, రామక్రిష్ణ, భాస్కర్‌, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 05 , 2025 | 12:41 AM