BJP : సూపర్ హిట్ చేద్దాం : సందిరెడ్డి
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:10 AM
అనంతపురంలో ఈనెల 10న నిర్వహించే సూపర్‌సిక్స్ - సూపర్‌హిట్ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆయన శనివారం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా సందిరెడ్డి మాట్లాడుతూ...గత 15నెలలుగా రాష్ట్ర ప్రజలు ఈ ప్రభు త్వాన్ని మంచి ప్రభుత్వంగా కొనియాడుతున్నారన్నారు.
ధర్మవరం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో ఈనెల 10న నిర్వహించే సూపర్‌సిక్స్ - సూపర్‌హిట్ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆయన శనివారం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా సందిరెడ్డి మాట్లాడుతూ...గత 15నెలలుగా రాష్ట్ర ప్రజలు ఈ ప్రభు త్వాన్ని మంచి ప్రభుత్వంగా కొనియాడుతున్నారన్నారు. ఎన్నికల మేనిఫే స్టోలో ప్రకటించిన హామీలనే కాకుండా ప్రతి కేబినేట్ సమావేశం తరు వాత ప్రజలకు కొత్త పథకాలను అందిస్తూ పాలనలో కొత్త చరిత్రను సృష్టి స్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని తీవ్రంగా వెనక్కి నెడుతూ ప్రజలను అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేసింద న్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్ సహకారం, అలాగే కేంద్ర ప్రభుత్వం మద్దతుతో సూపర్‌సిక్స్ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. అనంతరం జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో పేద, మఽ ద్యతరగతి కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించినందుకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామనకు కృతజ్ఞతగా వారి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జింకా చంద్ర, రూరల్ అధ్యక్షుడు గొట్లూరుచంద్ర, జిల్లా కార్యదర్శి డోలా రాజారెడ్డి, నాయకులు నబీరసూల్, పామిశెట్టి శివశంకర్, భక్తవత్సలం, పోతుకుంట రాజు తదితరులు పాల్గొన్నారు.