Share News

Independence Day : స్వర్ణ అనంతగా తీర్చిదిద్దుదాం

ABN , Publish Date - Aug 16 , 2025 | 12:35 AM

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి, ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తూ జిల్లాను స్వర్ణ అనంతగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి ప...

 Independence Day : స్వర్ణ అనంతగా తీర్చిదిద్దుదాం
Minister Payyavula Keshav, In-charge Collector Shivnarayana Sharma, and SP Jagadish saluting the national flag.

సంక్షేమం, అభివృద్ధి .. రెండు కళ్లు

సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధి

సూపర్‌ సిక్స్‌తోపాటు మరెన్నో పథకాలు

స్వాతంత్య్ర దినోత్సవంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌

అనంతపురం క్రైం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి, ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తూ జిల్లాను స్వర్ణ అనంతగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి పథంలో నిలపడానికి శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా పోలీస్‌ పరేడ్‌ మైదానంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి పయ్యావుల కేశవ్‌ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని అందించారు.

రూ.3850 కోట్లతో హెచఎనఎ్‌సఎ్‌స పనులు

హంద్రీనీవా సుజల స్రవంతి(హెచఎనఎ్‌సఎ్‌స) ప్రాజెక్టు అభివృద్ధికి ప్రభుత్వం రూ.3850 కోట్లు వెచ్చిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వంద రోజుల్లోనే రికార్డు


స్థాయిలో పనులు చేసి, కాలువ వెడల్పు పూర్తి చేశామన్నారు. మొదటి దశలో గుంతకల్లు మండలం కసాపురం నుంచి జీడిపల్లి వరకూ నీటి సామర్థ్యం 2200 క్యూసెక్కుల నుంచి 3850 క్యూసెక్కుల సామర్థ్యంతో తీసుకొస్తున్నామన్నారు. ప్రస్తుతం పీఏబీఆర్‌ డ్యాంను నింపుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 1,52,417 ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తున్నామన్నారు. హంద్రీనీవా నీటితో బీటీపీ, అప్పర్‌ పెన్నార్‌, పేరూరు ప్రాజెక్టులు, ఇతర చెరువు నింపేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రెండో దశ జీడిపల్లి నుంచి శ్రీ సత్యసాయి జిల్లా సరిహద్దు వరకూ 80 శాతం కాలువ లైనింగ్‌ పనులు పూర్తి చేశామన్నారు. రూ.33.89 కోట్లతో హెచ్చెల్సీ అభివృద్ధి పనులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

స్వర్ణాంధ్ర 2047 కోసం విజన ప్లాన

దేశంలో రాషా్ట్రన్ని అగ్రస్థానంలో నిలుపడం కోసం స్వర్ణాంధ్ర- 2047 విజనతో సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారన్నారు. తలసరి ఆదాయం రూ.2.66 లక్షల నుంచి 2047 నాటికి రూ. 55 లక్షలకు పెంచడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో పీ4 పథకం అమలులో భాగంగా ఇప్పటికే జిల్లాలో 4,800 మార్గదర్శకులు, 31 వేల బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు పేర్కొన్నారు.

హార్టికల్చర్‌ హబ్‌గా అనంత

జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన యోజన కింద మొదటి విడత నిధులు రైతులకు అందించా మన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా సబ్సిడీపై యంత్ర పరికరాలు, విత్తనాలు అందించామన్నారు. 2024-25లో సూక్ష్మ సేద్య పరికరాల మంజూరులో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో ఉందన్నారు.

సంక్షేమం, అభివృద్ధి వైపు...

సంక్షేమంలో భాగంగా ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు, విద్యార్థులకు తల్లికి వందనం, చేనేతలకు ఉచిత విద్యుత, సూపర్‌ సిక్స్‌ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే రేషన కార్డు ఉన్న ప్రతి కుటుబానికి ఏడాది మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు అందిస్తున్నట్లు తెలిపారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి నిరుపేదల ఆకలి తీరుస్తున్నట్లు మంత్రి వివరించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో భాగంగా 62,103 మంది యువతకు శిక్షణ ఇచ్చామన్నారు. జాబ్‌ మేళాల ద్వారా 26,639 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు తెలిపారు. 2025-26 ఆర్థిక ఏడాదికి సింగిల్‌ విండో విధానం ద్వారా 830 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 208 కిలోమీటర్ల జాతీయ రహదారులను అభివృద్ధి చేయగా, మరో 113.49 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి కోసం 309 హెక్టార్ల భూమిని సేకరించి 93.43 కోట్ల పరిహారం చెల్లించినట్లు మంత్రి కేశవ్‌ తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమం కింద జిల్లాలో రూ.123 కోట్లతో సిమెంట్‌ రోడ్లు, తారు రోడ్లు, కాలువల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పేదల గృహ నిర్మాణం కోసం సహకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

కొత్త విధానాలతో ముందుకు..

ప్రజల సౌకర్యార్థం నూతన ఇసుక పాలసీ తీసుకొచ్చామన్నారు. 165000 మెట్రిక్‌ టన్నుల ఇసుకను ఉచితంగా ప్రజలకు అందించినట్లు వివరించారు. వర్షాకాలంలో ప్రజల కోసం మరో 85972 మెట్రిక్‌ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచామన్నారు. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో భూఆక్రమణలు, సెక్షన 22ఏ, మ్యూటేషన, సబ్‌ డివిజన ఇతర సమస్యలపై 6914 అర్జీలు రాగా 6847 అర్జీలు పరిష్కరించినట్లు తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా 42,804 అర్జీలు స్వీకరించి 39,637 అర్జీలు పరిష్కరించినట్లు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణలో సైతం అహర్నిశలు శ్రమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇప్పటికే 99 శాతం అమలు చేసినట్లు వెల్లడించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, హిందూపురం ఎంపీ పార్థ సారథి, ఇనచార్జ్‌ కలెక్టర్‌ శివ నారాయణ శర్మ, జడ్పీ చైర్‌ పర్సన గిరిజమ్మ, జిల్లా ఎస్పీ జగదీష్‌, ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌, బండారు శ్రావణిశ్రీ, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన వెంకటశివుడు యాదవ్‌, మేయర్‌ వసీం, జిల్లా న్యాయాధికారి బీమారావు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సచిన రహర్‌, ఏఎస్పీ రోహితకుమార్‌ చౌదరి, డీఎ్‌ఫఓ విఘ్నేష్‌, డీఆర్వో మలోల, ఏడీసీసీ బ్యాంకు చైర్మన కేశవరెడ్డి, ఆర్టీసీ జోనల్‌ చైర్మన పూల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2025 | 12:35 AM