MLA: సీఎం సభను విజయవంతం చేద్దాం
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:07 AM
అనంతపురంలో ఈనెల 10న జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూపర్‌సిక్స్ సభను వి జయవంతం చేద్దామని సీఎం సభ సమన్వయకర్త, తణుకు ఎమ్మెల్యే రాధా కృష్ణ, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి కూటమిపార్టీ నాయకులకు, కార్య కర్తల కు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అద్యక్షులు మాధవ్ పాల్గొనే సూపర్‌సిక్స్ - సూపర్‌హిట్ సభను విజయవం తం చేయడంలో భాగంగా కూటమి పార్టీ కార్యకర్తలు, నాయకులతో ని ర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.
తణుకు, పుట్టపర్తి ఎమ్మెల్యేల పిలుపు
పుట్టపర్తిరూరల్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): అనంతపురంలో ఈనెల 10న జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూపర్‌సిక్స్ సభను వి జయవంతం చేద్దామని సీఎం సభ సమన్వయకర్త, తణుకు ఎమ్మెల్యే రాధా కృష్ణ, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి కూటమిపార్టీ నాయకులకు, కార్య కర్తల కు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అద్యక్షులు మాధవ్ పాల్గొనే సూపర్‌సిక్స్ - సూపర్‌హిట్ సభను విజయవం తం చేయడంలో భాగంగా కూటమి పార్టీ కార్యకర్తలు, నాయకులతో ని ర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కూటమిప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన 15 నెలల్లోనే సూపర్‌సిక్స్ పథకాలను సూపర్‌హిట్‌గా అమలు చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌కు కృతజ్ఞతలు తెలిపే విధంగా అనంతలో జరిగే సభను విజయవంతం చేయాలన్నారు.
పులివెందుల ఎమ్మెల్యే జగన వెన్నులో వణు కు పుట్టేలా భారీస్థాయిలో కూటమి నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. గత వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం వలన రాష్ట్ర ఖజానా ఖా ళీగా ఉన్నా చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలకిచ్చిన హామీలను, సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో అన్ని స్థానాలను కూటమి అభ్యర్థులే గెలిచేలా పనిచేయాలన్నారు. సభానంతరం తణుకు ఎమ్మెల్య్ణేకు ఎమ్మెల్యే సింధూరరెడ్డి బాబా చిత్రపటాన్ని, మెమెంటోను అందించి దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, ఎస్సీ ఫై నాన్స కార్పొరేషన చైర్మన ప్రభాకర్, ఏపీ కుమ్మరి శాలివాహన కార్పొరేషన చైర్మన ఈశ్వరన, రాష్ట్ర డైరక్టర్లు కాలేనాయక్, యశోద, శ్రీనివాసులు, టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మండల కన్వీనర్లు రామాంజి నేయులు, విజయ్‌కుమార్, జయచంద్ర, ఒలిపి శ్రీనివాసులు, మల్‌రెడ్డి, గో పాల్‌రెడ్డి, మైలేశంకర్, మాజీ జడ్పీటీసీ చెన్నకేశవులు, బీజేపీ నాయకులు కొండమరాజు, కళ్యాణ్ కుమార్, జ్యోతిప్రసాద్, సుదర్శన, ఉత్తమ్‌రెడ్డి, సురేం ద్రబాబు, బాలగంగా ధర్, జనసేన నాయకులు సతీష్, అబ్దుల్, సింగిల్ విండో అధ్యక్షులు, సభ్యులు, సాగునీటి సంఘం పాలకవర్గ సభ్యులు, మార్కెట్ యార్డు డైరెక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....