SILK: పట్టుతో రైతు ఆదాయం పెంచుదాం
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:29 AM
పట్టు ఉత్పత్తిని పెంచి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేద్దామని అనంతపురం ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రమ్య తెలిపారు. మండలంలోని రేగాటిపల్లిలో మంగళవారం ‘నా పట్టు-నా అభిమానం’ అనే ప్ర చార కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. శ్రీసత్యసాయి జిల్లా జా యింట్ డైరెక్టర్ శోభారాణి, ఏడీ అప్పలనాయుడు హాజరయ్యారు.
పట్టు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రమ్య
ధర్మవరం రూరల్, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి):పట్టు ఉత్పత్తిని పెంచి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేద్దామని అనంతపురం ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రమ్య తెలిపారు. మండలంలోని రేగాటిపల్లిలో మంగళవారం ‘నా పట్టు-నా అభిమానం’ అనే ప్ర చార కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. శ్రీసత్యసాయి జిల్లా జా యింట్ డైరెక్టర్ శోభారాణి, ఏడీ అప్పలనాయుడు హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించి, రైతులకు పట్టు ఉత్పత్తిపై అవగాహన కల్పించారు. ఆకుల నాణ్యత, దిగుబడిని పెంచడానికి పోషణ మల్టీ న్యూ ట్రియంట్ పిచికారీ, తెగుళ్ల నియంత్రణకు పురుగుమందులకు బదులుగా వేపనూనె వాడకంపై అవగాహన కల్పించారు. శాస్త్రవేత్త రమ్య మాట్లాడుతూ.. మల్బరీ పంటను కాపాడుకుంటూ అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక పట్టుపరిశ్రమశాఖ అధికారులు పాల్గొన్నారు.