Share News

DDO: స్వమిత్వను పకడ్బందీగా అమలు చేద్దాం : డీడీఓ

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:08 AM

స్వమిత్వ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ధర్మవ రం డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి జనార్ధనరావు సూచించారు. స్వమి త్వ పథకంలో భాగంగా మండలంలోని పోతులనాగేపల్లిలో క్షేత్రస్థాయి లో జరుగుతున్న సర్వేను ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ల సర్వే పూర్తిచేశారు? తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

DDO: స్వమిత్వను పకడ్బందీగా అమలు చేద్దాం : డీడీఓ
DDO Janardana Rao inspecting the survey at Potulanagepally

ధర్మవరంరూరల్‌, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): స్వమిత్వ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ధర్మవ రం డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి జనార్ధనరావు సూచించారు. స్వమి త్వ పథకంలో భాగంగా మండలంలోని పోతులనాగేపల్లిలో క్షేత్రస్థాయి లో జరుగుతున్న సర్వేను ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ల సర్వే పూర్తిచేశారు? తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిర్ణీతకాలంలో సర్వేను పూర్తిచేసి ఇళ్ల యాజ మానులకు యాజమాన్య హక్కులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవా లన్నారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి ప్రజలంందరికి మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు. సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, సమయపాలన పాటించాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేష్‌, పంచాయతీ సెక్రటరీ మురళీగౌడ్‌, సిబ్బంది పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Aug 14 , 2025 | 12:08 AM