FORMER MINISTER: కలసికట్టుగా అభివృద్ధి చేద్దాం
ABN , Publish Date - Oct 30 , 2025 | 11:59 PM
స్థానిక మార్కెట్‌యార్డ్ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని మాజీ మంత్రి పల్లె రఘు నాథరెడ్డి మార్కెట్‌యార్డ్ చైర్మన, డైరెక్టర్లకు సూచించారు. మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డ్‌లో తొలిసారిగా నూతన కమిటీ సమావే శాన్ని చైర్మన పూలశివప్రసాద్ అఽఽధ్యక్షతన గురువారం నిర్వహించా రు. మాజీ మంత్రి పల్లె ముఖ్యఅతిఽథిగా హాజరై మాట్లాడారు.
మార్కెట్ యార్డ్ కమిటీతో మాజీ మంత్రి పల్లె
కొత్తచెరువు, అక్టోబరు 30(ఆంఽధ్రజ్యోతి): స్థానిక మార్కెట్‌యార్డ్ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని మాజీ మంత్రి పల్లె రఘు నాథరెడ్డి మార్కెట్‌యార్డ్ చైర్మన, డైరెక్టర్లకు సూచించారు. మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డ్‌లో తొలిసారిగా నూతన కమిటీ సమావే శాన్ని చైర్మన పూలశివప్రసాద్ అఽఽధ్యక్షతన గురువారం నిర్వహించా రు. మాజీ మంత్రి పల్లె ముఖ్యఅతిఽథిగా హాజరై మాట్లాడారు. గొర్ల సంత ద్వారా వచ్చే ఆదాయంతో గొర్రెలకు తాగునీటి ట్యాంకులు, వి ద్యుత సౌకర్యం, షెడ్లను ఏర్పాటుచేయాలన్నారు. పాత షెడ్లకు మర మ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. గోదాము లు, ప్రహారీకి మరమ్మతులతో పాటు పేయింట్, షెట్టర్లను వే యిం చాలన్నారు. ధర్మవరం ప్రధాన రహదారి నుంచి మార్కెట్‌యార్డ్ ఆవరణంలోకి తారురోడ్డు, నూతన కార్యాలయం నిర్మించాలని ఆయ న సూచించారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నానాయుడు, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్‌తో చర్చించి నిధుల మంజూరుకు కృషిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన డైరెక్టర్ ఒలిపిశీన, కురుబ కార్పొరేషన డైరెక్టర్ గోరంట్లపల్లిశీన, మార్కెట్‌యార్డ్ డైరెక్టర్లు నిజాంవలి, జయశ్రీ, జ్యోతి ప్రసాద్, నంజప్ప, హేమావతి సుధీర్, సురేశ, మస్తానమ్మ, ప్రవీణ, గోపీనాథరెడ్డి, కిలారి శ్రీనాథ్, నాగరత్న, సిబ్బంది పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....