MLA: ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:58 PM
గణేష్ ఉత్సవాలను ప్రశాం తంగా జరుపుకుందామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నా రు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో గురువారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... అందరి సహ కారంతో గణేష్ ఉత్సవాలను వైభవంగా జరుపుకుందామని పేర్కొన్నారు.
శాంతి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట
కదిరి అర్బన, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): గణేష్ ఉత్సవాలను ప్రశాం తంగా జరుపుకుందామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నా రు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో గురువారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... అందరి సహ కారంతో గణేష్ ఉత్సవాలను వైభవంగా జరుపుకుందామని పేర్కొన్నారు. అధికారులు, పోలీసుల సూచనలు, సలహాలను పాటిస్తూ, ఎలాంటి సం ఘటనలు చోటుచేసుకోకుండా ఉత్సవ కమిటీ సభ్యులు చూడాలన్నారు. ఎంతో శోభాయమానంగా జరిగే నిమజ్జనం రోజున భక్తులకు ఎలాంటి అ సౌకర్యం కలుగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలన్నారు. సాయంత్రం 5 గంటల్లోగా విగ్రహాలన్నీ కోనేరు వద్దకు రావాలన్నారు. వి ద్యుత సరఫరా సక్రమంగా ఉండేలా విద్యుత అధికారులను ఆదేశించామ న్నారు. పనులు పండగలోగా పూర్తవుతాయన్నారు. నిమజ్జనం రోజు చిన్నా రులు, మహిళల విషయంలో బాధ్యతగా ఉండాలన్నారు. పోలీసులు సం యమనం పాటిస్తూ ట్రాపిక్‌కు అంతరాయం కలుగకుండా విగ్రహాలు ఊరేగింపు జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ వీవీఎస్ శర్మ, మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్, డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు నారాయణరెడ్డి, నిరంజనరెడ్డి, అన్నిశాఖల అధికారులు, సిబ్బంది, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, జనసేన భైరవప్రసాద్, బిజెపి వేణుగోపాల్‌రెడ్డి, రమేష్, టీడీపీ బాహుద్దీన తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....