MLA: డ్రగ్స్ రహిత సమాజం నిర్మిద్దాం
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:42 AM
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. టీఎనఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన యాంటీ డ్రగ్స్ పోస్టర్లను ఆయన బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి యువత రేపటి పౌరులన్నారు. వారు డ్రగ్స్ కు ఆకర్షితుల అయితే దేశ భవిష్యత్తు నాశనం అవుతోందన్నారు.
- ఎమ్మెల్యే కందికుంట
కదిరి అర్బన, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. టీఎనఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన యాంటీ డ్రగ్స్ పోస్టర్లను ఆయన బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి యువత రేపటి పౌరులన్నారు. వారు డ్రగ్స్ కు ఆకర్షితుల అయితే దేశ భవిష్యత్తు నాశనం అవుతోందన్నారు. ఆయనతో పాటు మున్సిపల్ చైర్‌పర్సన దిల్షాదున్నీషా, నాయకులు బాహుద్దీన, డైమండ్ ఇర్షాన, బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు చింతా నాగరాజు, ఉపాధ్యాయ సంఘం సూర్యశేఖర్, రాజేంద్ర, టీఎనఎస్‌ఎఫ్ సల్మాన తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి
కదిరి అర్బన, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వ్యవసాయ పరిఽశోధన కేంద్రంలో పని చేస్తున్న అవుట్‌సోర్పింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు బుధవారం ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. వారు బుధవారం ఎమ్మెల్యేని పట్టణంలోని ఆయన నివాసంలో కలిశారు. అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా 20 సంవత్సరాలుగా పరిశోధన కేంద్రంలో దాదాపు 28 మంది మహిళ కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వారికి వేతనాలు సక్ర మంగా ఇవ్వడంలేదన్నారు. బడ్జెట్ లేదన్న కారణంలో వారికి పనులు కల్పించకపోగా, మరో వైపు బయట కార్మికులను పనిలోకి తీసుకుం టున్నారని వారు ఎమ్మెల్యేకి విన్నవించారు. సీఐటీయూ నాయకులు జీఎల్ నరసింహులు, రామమోహన తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....