COLLECTOR: పరిశుభ్రమైనసమాజాన్ని నిర్మిద్దాం : కలెక్టర్
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:34 AM
పరిశుభ్రమైన సమా జం నిర్మాణం కోసం ప్రతిపౌరుడు బాధ్యత తీసుకోవాల్సిన అవసర ముం దని కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రతినెల మూడో శనివా రం నిర్వహించే స్వచ్ఛాంధ్ర-- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మం డలపరిధిలోని జగరాజుపల్లి కేజీబీవీని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి, పాఠశాలలో చేపడుతున్న పరిశుభ్రత చర్యల గురించి తెలుసుకున్నారు.
పుట్టపర్తిరూరల్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): పరిశుభ్రమైన సమా జం నిర్మాణం కోసం ప్రతిపౌరుడు బాధ్యత తీసుకోవాల్సిన అవసర ముం దని కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రతినెల మూడో శనివా రం నిర్వహించే స్వచ్ఛాంధ్ర-- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మం డలపరిధిలోని జగరాజుపల్లి కేజీబీవీని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి, పాఠశాలలో చేపడుతున్న పరిశుభ్రత చర్యల గురించి తెలుసుకున్నారు. విద్యార్థినుల హాస్టళ్లను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యా ర్థులు వ్యక్తిగత పరిశుభ్రతను తప్పనిసరిగా అలవరచుకోవాలని తెలియ జేశారు. చేతుల పరిశుభ్రతపై డెమో నిర్వహించారు. వ్యక్తిగత పరిశుభ్ర తలో చేతుల పరిశుభ్రత అత్యంత ముఖ్యమని సూచించారు. అనంతరం వ్యక్తిగత పరిశుభ్రతపై చేసిన ప్రతిజ్ఞలో విద్యార్థినులతో పాటు పాల్గొన్నా రు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సమత, డీఈఓ కిష్టప్ప, ఎంఈఓ, కేజీవీబీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....