Share News

MEETING: నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేద్దాం

ABN , Publish Date - Aug 20 , 2025 | 11:52 PM

నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేద్దామని మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌కుమార్‌, వయో జన విద్యాశాఖ నోడల్‌ అధికారి జనార్దన పిలుపునిచ్చారు. నిరక్షరాస్యులను చదువరులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్‌ అక్షరాం ధ్ర కార్యక్రమంపై బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో అవగాహన సద స్సు నిర్వహించారు.

MEETING: నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేద్దాం
Officials speaking in the meeting

మున్సిపల్‌ కమిషనర్‌, వయోజన నోడల్‌ అధికారి

కదిరి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేద్దామని మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌కుమార్‌, వయో జన విద్యాశాఖ నోడల్‌ అధికారి జనార్దన పిలుపునిచ్చారు. నిరక్షరాస్యులను చదువరులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్‌ అక్షరాం ధ్ర కార్యక్రమంపై బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సదస్సులో మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌కు మార్‌, వయోజన విద్యాశాఖ నోడల్‌ అధి కారి జనార్దన మాట్లాడుతూ... 15 యేళ్ల నుంచి 59 మధ్య నిరక్షరాస్యులైన వయోజనులకు సాంకేతికత, వయోజ విద్య అందుబాటులోకి తెచ్చే కార్యక్రమమే అక్షరాంరఽధ అన్నారు. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఎవరైనా స్వచ్ఛంద బోధకులుగా ఒక్కొక్కరు కనీసం పది మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాల న్నారు. రాను న్న రోజుల్లో వయోజనులను వందశాతం అక్షరాస్యులుగా మార్చడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు. ఉపాధి, వెలుగు, మెప్మా, మహిళా సంఘం సభ్యులు, అంగనవాడీ ఆయాలు, ఆ శాఖ ద్వారా లబ్ధిపొందుతున్న గర్భి ణులు, బాలింతల్లో నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా మార్చాలని సూచించారు. త్వరతగతిన నిరక్షరాస్యులను గుర్తించి జాబితా తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ పర్యవేక్షకులు సుధాకర్‌, రవీంద్రనాయుడు, మెప్మా సిటీ మిషన మేనేజర్‌ శివకుమార్‌, టీపీఓ సతీష్‌కుమార్‌, సీఓ గిరీష్‌, సుపర్‌వైజర్‌ మురళీక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Aug 20 , 2025 | 11:53 PM