SEWAGE: ఈతోడులో పైప్‌లైన లీకేజీలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:13 AM
మండల పరిధిలోని ఈతోడు గ్రామంలో తాగునీటి పైప్‌లైన మూడు చోట్ల లీకేజీ అయి, ఆ నీరు రోడ్లపై వృథాగా ప్రవహిస్తోంది. చాలా రోజులుగా ఈ పరిస్థితి నెలకొ న్నా గ్రామ పంచాయ తీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే ఇళ్లలోని మురు గునీటిని రోడ్ల పైకి వదిలేస్తున్నారు.
వృథాగా రోడ్లపై పారుతున్న తాగునీరు
మురుగునీటితో కలిసి దుర్వాసన
ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు
తనకల్లు, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని ఈతోడు గ్రామంలో తాగునీటి పైప్‌లైన మూడు చోట్ల లీకేజీ అయి, ఆ నీరు రోడ్లపై వృథాగా ప్రవహిస్తోంది. చాలా రోజులుగా ఈ పరిస్థితి నెలకొ న్నా గ్రామ పంచాయ తీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే ఇళ్లలోని మురు గునీటిని రోడ్ల పైకి వదిలేస్తున్నారు. ఈ కారణంగా ప్రతి రోజు గ్రామంలో మహిళలు గొడవలు పడుతున్నారు. పైప్‌లైన లీకీజీ కారణంగా వచ్చే నీరు, మురుగునీరు రోడ్లపై నిలువ ఉండి మడుగులను తలపిస్తున్నాయి. దోమలకు నిలయంగా మారి, వృద్ధి చెందుతున్నాయి. అంతేగాకుండా మురుగు నీటి దుర్వాసనను భరించలేకపోతున్నామని స్థానికులు తెలుపుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న అటు గ్రామ పంచాయతీ అధికారులు కానీ, ఆరోగ్యశాఖ అధికా రులు కానీ ఆ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. గ్రామంలోని యువకు లు స్థానిక పంచాయతీ కార్యదర్శి దృష్టికి సమస్యను తీసుకుకెళ్లినా ఫలితం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఉన్నతాధి కారులకు ఫిర్యాదు చేస్తామన్నా కార్యదర్శి పట్టించుకోకపోవడంతో తమ సమస్య ఎవరికి చెప్పు కోవాలో అర్థం కావడం లేదని గ్రామ యువకులు ఆరోపిస్తున్నారు. గ్రామా నికి నీరు సరఫరా చేసే పైప్‌లైనలు పగిలిపోయి నీరు వృఽథాగా రోడ్లమీద పారుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి నీరు అందించే బోరు వద్ద ఏర్పాటుచేసిన పైప్‌లైనకు బోల్ట్ బిగించకుండా ఒక చెక్క కొట్టి వదిలేయడంతో నీరు వృథా అవుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. అదే విధంగా గ్రామంలో వీధి దీపాలు వెలగకపోయినా అ ధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. పం చాయతీ అధికారులు, స ర్పంచ పన్నుల వసూలు మీద చూపించే శ్రద్ధలో ఒక్క శాతం కూడా గ్రామాభి వృద్ధిపై కనబరచడంలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో దో మల కారణంగా ఇబ్బం దు లు పడుతున్నామని తెలిపా రు. ఇప్పటికైనా సంబంఽధిత ప్రజా ప్రతినిధులు, అధికా రులు స్పందించి గ్రామంలో నెలకొన్న సమస్యల ను పరిష్కరించాలని గ్రామస్థు లు విజ్ఞప్తి చేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....