SCHEME: ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్’ ప్రారంభం
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:56 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన కార్యక్ర మాన్ని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ప్రారంభించారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ సం యుక్త భాగస్వామ్యంలో నిర్వహంచనున్న ఈ కార్యక్రమ పోస్టర్లను జేసీ అభిషేక్ కుమార్, రాష్ట్ర నో డల్ ఆఫీసర్, అడిషనల్ డైరక్టర్ డాక్టర్ అనిల్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఫైరోజ్‌బేగం, ఐసీడీఎప్ పీడీ ప్రమీల, డిప్యూటీ డీఎం హెచఓ డాక్టర్ పీఎస్ మంజువాణి, ఆర్డీఓ సువర్ణ, వైద్యాధి కారులు డాక్టర్ సునీల్ విడుదల చేశారు.
పుట్టపర్తిటౌన, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన కార్యక్ర మాన్ని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ప్రారంభించారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ సం యుక్త భాగస్వామ్యంలో నిర్వహంచనున్న ఈ కార్యక్రమ పోస్టర్లను జేసీ అభిషేక్ కుమార్, రాష్ట్ర నో డల్ ఆఫీసర్, అడిషనల్ డైరక్టర్ డాక్టర్ అనిల్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఫైరోజ్‌బేగం, ఐసీడీఎప్ పీడీ ప్రమీల, డిప్యూటీ డీఎం హెచఓ డాక్టర్ పీఎస్ మంజువాణి, ఆర్డీఓ సువర్ణ, వైద్యాధి కారులు డాక్టర్ సునీల్ విడుదల చేశారు. అనంతర స్థానిక ప్రాథమి క ఆరోగ్యకేంద్రంలో స్ర్తీసంబంధిత వైద్యసేవల కార్యక్రమం, అభా కార్డులు, పీఎంజేఏవై కార్డుల నమోదు నిర్వహించారు. ‘ఒక తల్లి - ఒక చెట్టు’ కార్య క్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు.
ధర్మవరంరూరల్: మండలంలోని నిమ్మలకుంట గ్రామంలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన హారీశబాబు మాట్లాడారు. అనంతరం దర్శినమల పీహెచసీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సందేశాన్ని వర్చువల్ ద్వారా వీక్షించారు. కార్యక్రమంలో డాక్టర్ పుష్పలత, వైద్యసిబ్బంది, బీజేపీ మండల కన్వీనర్ గొట్లూరు చంద్ర, అంగజాల రాజు తదితరులు పాల్గొన్నారు.
బుక్కపట్నం/ కదిరి అర్బన/ ముదిగుబ్బ: మహిళల ఆరోగ్యం కోసమే ప్రభుత్వం స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన ప్రవేశపెట్టిందని వైద్యాధికారి సురేష్‌కుమార్, రాష్ట్ర లైవ్‌స్టాక్ కార్పొరేషన డైరెక్టర్ సాకే యశోదరాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంపై బుధవారం మండలకేంద్రం లో ర్యాలీ నిర్వహించారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు లావణ్యగౌడ్ తది తరులు పాల్గొన్నారు. అలాగే కదిరి మండలంలోని పట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన నిర్వహించారు. వైద్యాధికారి వినోద్‌కుమార్, సీహెచఓ లక్ష్మీదేవమ్మ తదితరులు పాల్గొన్నా రు. ముదిగుబ్బలో స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన కార్యక్రమాన్ని మండల వైద్యాధికారులు రాజేం ద్ర, శ్వేతా ఆధ్వర్యంలో నిర్వహించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....