Land Issue : రాయలచెరువులో భూ వివాదం
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:59 AM
మండల పరిధిలోని రాయలచెరువులో భూ సమస్య పెద్ద వివాదానికి దారితీసింది. రాయలచెరువులోని ప్రైవేట్ ల్యాండ్‌ను తాము కొన్నామని పులివెందులకు చెందిన కొందరు వ్యక్తులు ఐదు వాహనాల్లో మంగళవారం రాయలచెరువుకు వచ్చారు. ఆ భూమిలో ఉన్న దుకాణాలను ఖాళీ చేయాలని దుకాణ యజమానులకు సూచించారు. అదే సమయంలో ఆ భూమి తమ అధీనంలో ఉందని, సర్వ హక్కులు ఉన్నాయంటూ రాయలచెరువుకు చెందిన ...

కొన్నామంటూ వచ్చిన పులివెందుల వాసులు
అడ్డుకున్న స్థానికులు.. తీవ్ర వాగ్వాదం
పోలీస్ స్టేషనకు చేరిన పంచాయితీ
యాడికి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని రాయలచెరువులో భూ సమస్య పెద్ద వివాదానికి దారితీసింది. రాయలచెరువులోని ప్రైవేట్ ల్యాండ్‌ను తాము కొన్నామని పులివెందులకు చెందిన కొందరు వ్యక్తులు ఐదు వాహనాల్లో మంగళవారం రాయలచెరువుకు వచ్చారు. ఆ భూమిలో ఉన్న దుకాణాలను ఖాళీ చేయాలని దుకాణ యజమానులకు సూచించారు. అదే సమయంలో ఆ భూమి తమ అధీనంలో ఉందని, సర్వ హక్కులు ఉన్నాయంటూ రాయలచెరువుకు చెందిన కొందరు వ్యక్తులు ముందుకు వచ్చారు. దుకాణాలను ఖాళీ చేయించడానికి మీరెవరు అంటూ ఇరువర్గాల వారు కాసేపు వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాల వారితో మాట్లాడారు. ఆధారాలతో
పోలీ్‌సస్టేషనకు రావాలని సూచించారు. సాయంత్రం 7గంటల సమయంలో ఇరువర్గాల వారు పోలీ్‌సస్టేషనకు వెళ్లారు. పంచాయితీ ఎంతకూ తెగకపోవడంతో బుధవారం ఉదయం 10 గంటలకు మళ్లీ ఇరువర్గాల వారు పోలీ్‌సస్టేషనకు రావాలని పోలీసులు చెప్పి పంపినట్లు సమాచారం. భూ వివాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎవరి భూమి..?
రాయలచెరువులో వివాదాస్పదనమైన భూమి ఎవరిదనే చర్చ జరుగుతోంది. ఆ భూమి 1982 నుంచి తమ అధీనంలో ఉందని రాయలచెరువుకు చెందిన వారు చెబుతున్నారు. సుమారు 1.25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్ని కొనేందుకు నంద్యాల జిల్లా డోనకు చెందిన ఒక వ్యాపారి వద్ద పులివెందులవారు ఆరునెలలక్రితం అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిసింది. కోట్ల రూపాయలు విలువజేసే ఈ భూ వివాదం ఎక్కడికి దారితీస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....