Share News

CITU: లేబర్‌కోడ్‌లను ఉపసంహరించుకోవాలి

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:04 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లే బర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని సీ ఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డి మాండ్‌చేశారు. లేకపోతే పెద్దఎత్తున ఉద్య మాలు చేపడుతామని హెచ్చరించారు. కేం ద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌ల నోటిఫికేషనకు వ్యతిరేకంగా సీఐటీ యూ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కళా జ్యోతిసర్కిల్‌లో అంబేడ్కర్‌ విగ్రహం ఎదు ట నిరసన చేపట్టారు.

CITU: లేబర్‌కోడ్‌లను ఉపసంహరించుకోవాలి
CITU leaders burning copies of labor codes in Dharmavaram

సీఐటీయూ నాయకులు

ధర్మవరం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లే బర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని సీ ఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డి మాండ్‌చేశారు. లేకపోతే పెద్దఎత్తున ఉద్య మాలు చేపడుతామని హెచ్చరించారు. కేం ద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌ల నోటిఫికేషనకు వ్యతిరేకంగా సీఐటీ యూ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కళా జ్యోతిసర్కిల్‌లో అంబేడ్కర్‌ విగ్రహం ఎదు ట నిరసన చేపట్టారు. లేబర్‌కోడ్‌ కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ... ఈనెల 26న కార్మికసం ఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసనకు పిలుపు ఇచ్చామన్నారు. రైతుసంఘం జిల్లా కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, సీఐటీయూ సీనియర్‌ నాయకులు ఎసహెచబాషా తదితరులు పాల్గొన్నారు.

బత్తలపల్లి/ముదిగుబ్బ:లేబర్‌ కోడ్‌ పత్రాలను సీపీఐ నాయకులు శనివారం బత్తలపల్లిలోని నాలుగు రోడ్ల కూడలిలో దహనం చేశారు. సీపీఐ జిల్లా నాయకు లు రామక్రిష్ణ, కాటమయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ముదిగుబ్బలోని బ స్టాండ్‌ కూడలిలో లేబర్‌ కోడ్‌లకు సంబం ధించిన పత్రాలు దహనం చేశారు. సీఐటీ యూ మండల కార్యదర్శి బండల వెంక టేష్‌ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Nov 23 , 2025 | 12:04 AM