CPM: పెట్టుబడిదారుల కోసమే లేబర్ కోడ్‌లు
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:31 AM
పాత చట్టాలలో ఉన్న కొద్దిపాటి హక్కులను కూడా రద్దు చేసి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను తెచ్చిందని సీపీఎం పొలిట్ సభ్యుడు బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు.
సీపీఎం పొలిట్ సభ్యుడు బీవీ రాఘవులు
లేబర్ కోడ్‌ల రద్దు కోసం సీఐటీయూ నిరసన
కదిరి అర్బన, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): పాత చట్టాలలో ఉన్న కొద్దిపాటి హక్కులను కూడా రద్దు చేసి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను తెచ్చిందని సీపీఎం పొలిట్ సభ్యుడు బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీవీ రాఘవులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికులు ఈ లేబర్ కోడ్‌ల అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి జీఎల్ నరసింహులు, నాయకులు లక్ష్మీనారాయణ, సాంబశివ, బాబ్జాన, రామ్మోహన, ముస్తాక్, రాజారెడ్డి, నాగరాజు, బడా సుధాకర రెడ్డి, అంగనవాడీ నాయకురాళ్లు సుజాత. ప్రమీలమ్మ, రంగమ్మ, రాధ, మోక్షప్రియ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....