CM: సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:40 AM
స్ర్తీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించిన సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్ చిత్రపటా లకు క్షీరాభిషేకం చేశారు. మండలకేంద్రంలో శనివారం టీడీపీ మండలాధ్యక్షురాలు సుబాషిణి, నాయకురాలు వాల్మీకి నాగవేణి అధ్వర్యంలో క్షీరాభిషేకం చేసి, థ్యాక్యూ సీఎం అంటూ నినాదాలుచేశారు.
ఓబుళదేవరచెరువు, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): స్ర్తీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించిన సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్ చిత్రపటా లకు క్షీరాభిషేకం చేశారు. మండలకేంద్రంలో శనివారం టీడీపీ మండలాధ్యక్షురాలు సుబాషిణి, నాయకురాలు వాల్మీకి నాగవేణి అధ్వర్యంలో క్షీరాభిషేకం చేసి, థ్యాక్యూ సీఎం అంటూ నినాదాలుచేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు అఖిల, స్వర్ణ, కూమారి, అశ్వని, గౌసియా తదితరులు పాల్గొన్నారు.
తనకల్లు : మండలపరిధిలోని కొక్కంటి క్రాస్‌లో శనివారం సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్, ఎమ్మె ల్యే కందికుంట వెంకటప్రసాద్ చిత్రపటాలకు మహిళలు క్షీరా భిషేకం చేశారు. ఎన్నికలత్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారం భించినందుకు కృతజ్ఞతగా క్షీరాభిషేకం చేసినట్లు ఆసుపత్రి అభివృ ద్ధి కమిటీ సభ్యుడు సోంపాల్యం నాగభూషణం తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు శారద, రాణి, సుజాత, భారతి, లక్ష్మీదేవి, వెంకటరమణమ్మ, మాలతి, పలువురు మహిళలు, నాయకులు జయకుమార్‌నాయక్, వెంకటరమణ, పులి మహేష్, వేణుగోపాల్ నాయుడు, చిన్న గోవిందు, నాగరాజు, పూల రమేష్, లక్ష్మణ, జిలేబి వెంకటరమణ, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.