INSPECTION: కేజీబీవీ ఆకస్మిక తనిఖీ
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:43 PM
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)ని ఎంపీడీఓ నసీ మా, పంచాయతీ కార్యదర్శి మంజుల, ఎంపీపీ ఆదినారాయణ యా దవ్ ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పౌష్టికాహారం అందజేత, సిబ్బంది, టీచర్ల పనితీరుపై బాలికలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేజీబీవీలో పౌష్టికాహారం అం దజేయడంలో లోపం తీవ్రంగా ఉందన్నారు.
ముదిగుబ్బ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)ని ఎంపీడీఓ నసీ మా, పంచాయతీ కార్యదర్శి మంజుల, ఎంపీపీ ఆదినారాయణ యా దవ్ ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పౌష్టికాహారం అందజేత, సిబ్బంది, టీచర్ల పనితీరుపై బాలికలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేజీబీవీలో పౌష్టికాహారం అం దజేయడంలో లోపం తీవ్రంగా ఉందన్నారు. రాగిపిండి లేకుండా బాలికలకు రాగిముద్దలు వడ్డిస్తున్నారన్నారు. మొదటి పిరియడ్ అ యిపోయినా టిఫిన ఇవ్వడం లేదని, మెనూ పాటించడం లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాగే వంటకాలు చేసేట ప్పుడు చదువుతున్న బాలికలతో పను చేయిస్తున్నారని తెలిసింద న్నారు. వంట సిబ్బంది తరచూ గొడవ పడుతుండడం వల్ల చదువు కోవడం చాలా కష్టంగా ఉందని బాలికలు అధికారుల దృష్టికి తెచ్చి నట్లు తెలిపారు. పై సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....