SCHOOL: కన్నతల్లిని..చదువుకున్న బడిని మరువరాదు
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:58 PM
కన్నతల్లిని....చదువుకున్న బ డిని ఎన్నటికీ మరువరాదని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మం డలంలోని మారాల జడ్పీ ఉన్నత పాఠశాలలో 2006-07బ్యాచకు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం కలిశారు. ఒకరినొకరు యోగక్షమా లను అడిగితెలుసుకుంటూ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉద యం నుంచి సాయంత్రం వరకు కలిసిమెలసి ఆనందంగా గడిపారు.
పలువురు ఉపాధ్యాయుల ఉద్బోధ
బుక్కపట్నం, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): కన్నతల్లిని....చదువుకున్న బ డిని ఎన్నటికీ మరువరాదని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మం డలంలోని మారాల జడ్పీ ఉన్నత పాఠశాలలో 2006-07బ్యాచకు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం కలిశారు. ఒకరినొకరు యోగక్షమా లను అడిగితెలుసుకుంటూ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉద యం నుంచి సాయంత్రం వరకు కలిసిమెలసి ఆనందంగా గడిపారు. ఆనాడు వి ద్యాబుద్దులు నేర్పిన అప్పటి ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు శాలు వాలు కప్పి ఘనంగా సత్కరించారు. అలాగే పాఠశాలలో విద్యార్థుల భోజన వసతి కోసం షెడ్ నిర్మాణానికి రూ.65వేలు అంచనాతో శంకుస్థాపన చేశా రు. దీంతో అప్పటి ఉపాధ్యాయులు పూర్వవిద్యార్థులను అభినందించారు.
ఓబుళదేవరచెరువు: మండలలోని మిట్టపల్లి జిల్లా పరిషత ఉన్నతపాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పాఠశాలలో 1988-89లో పదో తరగతి చదివిన విద్యార్థులు కలిశారు. అప్పటి ఉపాధ్యాయులు సత్యనారాయణ, నాగరాజరావు, కొండారెడ్డి, రామాంజనేయులును దుశ్శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సుధాకర్, గంగాద్రి, నీలోఫర్, బాలుబీ, పద్మావతమ్మ, మధుసూదనరెడ్డి, రవూఫ్, బాలిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, తిప్పన్న, వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....