CROP: కంది పంట కళకళ
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:32 PM
మండలవ్యాప్తం గా ఖరీఫ్‌లో ముందస్తుగా సాగుచేసిన కంది పంట కళకళలాడు తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు పెంట ఏపుగా పెరిగింది. మండ లంలో ఈ ఏడాది వేరుశనగ కన్నా కందిపంట అత్యధికంగా సాగు చేసినట్లు వ్యవసాయాధి కారులు తెలుపుతున్నారు.
ధర్మవరం రూరల్, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): మండలవ్యాప్తం గా ఖరీఫ్‌లో ముందస్తుగా సాగుచేసిన కంది పంట కళకళలాడు తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు పెంట ఏపుగా పెరిగింది. మండ లంలో ఈ ఏడాది వేరుశనగ కన్నా కందిపంట అత్యధికంగా సాగు చేసినట్లు వ్యవసాయాధి కారులు తెలుపుతున్నారు. వర్షాలకు కంది పంట ఏపుగా పెరుగుతుండటంతో సకాలంలో మందులు పిచికారి చేసి పూత, పిందెను కాపాడుకుంటే దిగుబడి బాగా వ స్తుందని చెబుతున్నారు. వారం క్రితం కురిసిన వర్షాల వల్ల కందిపంట బాగా ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....