TDP: వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:49 AM
మండలంలో వైసీపీ భారీ షాక్ తగిలింది. మండలంలో వైసీపీలో కీలకంగా ఉన్న పలువురు నాయకులు బుధవారం టీడీపీ మండల నాయకులు హర్షవర్దన, గణేశ ఆధ్వర్యంలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతపురంలోని ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాల యంలో తాడిమర్రికి చెందిన బండారు నరేంద్ర, పన్నూరు నాగభూషణ, హరిజన నరసింహుడు, తలారి నారాయణస్వామితో పాటు మొత్తం 40 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
తాడిమర్రి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మండలంలో వైసీపీ భారీ షాక్ తగిలింది. మండలంలో వైసీపీలో కీలకంగా ఉన్న పలువురు నాయకులు బుధవారం టీడీపీ మండల నాయకులు హర్షవర్దన, గణేశ ఆధ్వర్యంలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతపురంలోని ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాల యంలో తాడిమర్రికి చెందిన బండారు నరేంద్ర, పన్నూరు నాగభూషణ, హరిజన నరసింహుడు, తలారి నారాయణస్వామితో పాటు మొత్తం 40 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారికి పరిటాలశ్రీరామ్ పార్టీ కండు వాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్న తీరు చూసి టీడీపీలో చేరామని వారు అన్నారు. అలాగే వైసీపీలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నా ఎలాంటి గుర్తింపు లేకపోగా తమ ప్రాంతానికి ఎలాంటి మంచి జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పక్కీర్‌రెడ్డి, రంగయ్య, కుళ్లాయరెడ్డి, నాగేంద్ర, ఓబుళేశు పాల్గొన్నారు.