GOD: జయము జయము గణేశా..!
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:37 PM
గణేశ నిమజ్జనాన్ని ఐదో రోజు ఆదివారం పుట్టపర్తి, ధర్మవరంలో ఉల్లా సంగా నిర్వహించారు.ధర్మవరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన విగ్ర హాలను ట్రాక్టర్లపై, ఆటోలపై ఉంచి నిమజ్జనానికి తీసుకెళ్లారు. డీఎస్పీ హే మంత కుమార్ ఆధ్వర్యంలో సీఐలు నాగేంద్రప్రసాద్, రెడ్డప్ప గట్టి బందో బస్తు నిర్వహించారు.
ఘనంగా నిమజ్జనం
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
గణేశ నిమజ్జనాన్ని ఐదో రోజు ఆదివారం పుట్టపర్తి, ధర్మవరంలో ఉల్లా సంగా నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన విగ్ర హాలను ట్రాక్టర్లపై, ఆటోలపై ఉంచి నిమజ్జనానికి తీసుకెళ్లారు. డీఎస్పీ హే మంత కుమార్ ఆధ్వర్యంలో సీఐలు నాగేంద్రప్రసాద్, రెడ్డప్ప గట్టి బందో బస్తు నిర్వహించారు. పట్టణ సమీపంలోని సంగమేశ్వర, మోటుమర్ల, గొల్ల పల్లి, కుణుతూరు వంకల్లో ని మజ్జ నం చేశారు. అలాగే పట్టణం లో ని పలు వార్డుల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పలు వినాయక వి గ్రహా ల నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మం త్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలె త్తకుండా నిమజ్జనం కోసం రెండు భారీ క్రేన్లను ఏర్పాటుచేసినట్టు బీ జేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు తెలిపారు. నిమజ్జనానికి అవస రమైన సహాయం అందించామన్నారు. అలాగే నల్లమాడ, నంబులపూల కుంట, తలుపుల మండలాల్లో వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....