GOD: జై జై గణేషా..!
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:16 AM
విజయాల నాయకుడు వినాయ కుడు వాడవాడలా కొలువుదీరి భక్తుల పూజలు అందుకుంటున్నారు. వినాయక చతుర్థి సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రం పుట్టపర్తితో పాటు ధర్మవరం, కదిరి పట్టణాలు, మండల కేంద్రాల్లోని, గ్రామాల్లోని పలు వీధులలో ఉత్సవ కమిటీలు వినాయక విగ్రహాలను ఏర్పాటుచేసి పూజలు చేశారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్ వర్క్)
విజయాల నాయకుడు వినాయ కుడు వాడవాడలా కొలువుదీరి భక్తుల పూజలు అందుకుంటున్నారు. వినాయక చతుర్థి సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రం పుట్టపర్తితో పాటు ధర్మవరం, కదిరి పట్టణాలు, మండల కేంద్రాల్లోని, గ్రామాల్లోని పలు వీధులలో ఉత్సవ కమిటీలు వినాయక విగ్రహాలను ఏర్పాటుచేసి పూజలు చేశారు. ప్రధానంగా చిత్రావతిరోడ్డు, గణేశ సర్కిల్, సమాఇ రోడ్డు, ఎస్‌బీఐ రోడ్డు, కుమ్మరపేట, సత్యమ్మగుడి వద్ద, ఎనుములపల్లి, బ్రాహ్మణపల్లి బీడు పల్లి, ప్రశాంతిగ్రామం. పెద్దకమ్మ వారిపల్లి ప్రాంతాలలో భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. జిల్లాకేంద్రం పరిధిలోని మునిసిపాలిటీ పరిధిలో 75, రూరల్ మండల పరిధిలో 85 విగ్రహాలు ఏర్పాటుచేశారు. శనివారం ఎనుమలపల్లి, సాహెబ్‌చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అర్బన సీఐ శివాంజనేయులు, మునిసిపల్ కమిషనర్ క్రాంతికుమార్ తెలిపారు. రూరల్ పరిధిలో శుక్రవారం కొన్ని, శనివారం మరికొన్నింటి నిమజ్జనానికి ఏర్పాట్లను చేపడుతున్నట్లు రూరల్ ఎస్సై లింగన్న పేర్కొన్నారు. అలాగే ధర్మవరం పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురం, లింగిశెట్టిపాళ్యం, పీఆర్‌టీ, కొత్తపేట, రాంనగర్, శాంతినగర్, శివానగర్, దిగువగేరి, దుర్గానగర్, యాదవవీధి, లోని కోట, నేసేపేట, సా యినగర్, తేరు బజార్, ఆర్యవైశ్య కొత్తసత్రం, గాంధీ నగర్, శివానగర్, లక్ష్మీనగర్, రైల్వే కాలనీ, తుంపర్తి కాలనీతదితర ప్రాంతాల్లో ఏర్పా టు చేసిన వినా యక ప్రతిమలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ప్రజలు సుఖ సంతోషాలతో జీవిం చాలని కోరుతూ రేగాటిపల్లిలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి, ఆయన సతీమణి చాయాదేవి, 35వ వార్డులో చే నేత ప్రముఖులు, సంధారాఘవ, సఽంధారవి కుటుంబసభ్యులతో వినా యకుడికి ప్రత్యేక పూజలు చేశారు. కదిరి పట్టణంలో ప్రధానంగా రైల్వేస్టేషన వద్ద, గొల్లమ్మ మండపం, శివాలయం వద్ద భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి, పూజలు చేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....