Share News

MLA: ముస్లింలపై జగన కొత్త నాటకం

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:05 AM

ముస్లింలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మరో కొత్తనాటకానికి తెర లేపారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన సోమవారం పట్టణంలోని తన ని వాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముస్లింల విషయంలో జగన రాష్ట్రంలో కొత్తనాటకం ఆడుతున్నారని విమర్శించారు. అందుకు తొత్తుగా ఎంపీ అసాదుద్దీన ఓవైసీని వాడుకుంటున్నారన్నారు.

MLA: ముస్లింలపై జగన కొత్త నాటకం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందికుంట

- శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే సహించం

- అత్యధిక ట్రెండ్‌ అవుతున్న తల్లికి వందనం

- ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌

కదిరి, జూన 16(ఆంధ్రజ్యోతి): ముస్లింలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మరో కొత్తనాటకానికి తెర లేపారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన సోమవారం పట్టణంలోని తన ని వాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముస్లింల విషయంలో జగన రాష్ట్రంలో కొత్తనాటకం ఆడుతున్నారని విమర్శించారు. అందుకు తొత్తుగా ఎంపీ అసాదుద్దీన ఓవైసీని వాడుకుంటున్నారన్నారు. అయితే మైనార్టీలకు రక్షణ, సంక్షేమం, అభివృద్ధి కల్పించేది ముఖ్యమంత్రి చంద్ర బాబే అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోకానీ, నవ్యాంధ్రప్రదేశలో కానీ మత ఘర్ష ణలు అదుపు చేసింది చంద్రబాబే అన్నారు. ముస్లింల సంక్షేమానికి కృషి చేశారన్నారు.


ముస్లిం పక్షపాతిగా చెప్పుకునే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, గతంలో అధికారం కోసం మత ఘర్షణలు లేపారన్నారు. పులివెందల నుంచి అల్లరి మూకలతో గొడవలు సృష్టించారన్నారు. వైసీపీ పాలనలో నంద్యాల్లో ఓ ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. దేశంలో అత్య ధికంగా తల్లికి వందనం ట్రెండ్‌ అవుతోందన్నారు. 64లక్షల మంది పిల్లలకు రూ. పదివేల కోట్లు చెల్లించామన్నారు. దీన్ని చూసి ఓర్వలేక వైసీపీ బెంబే లెత్తుతోందన్నారు. మరోవారంలో అన్నదాత సుఖీభవ సొమ్ము రైతుల ఖా తాల్లో జమ అవుతుందన్నారు. నియోజకవర్గంలో శాంతి భద్రలకు విఘా తం కలిగిస్తే ఉక్కుపాదం మోపుతామన్నారు. శిలాఫలకాన్ని పగులకొట్టిన తాగుబోతులకు వైసీపీ వంతపాడుతోందన్నారు. దొంగలకు, భూకబ్జాదారు లకు, దళారులకు, ప్రభుత్వ ఆస్తులు కొట్టేసేవారికి ఇప్పుడు భయం చుట్టుకుం దన్నారు. వారికి తాను సింహ స్వప్నంగా కనిపిస్తున్నానన్నారు. ముస్లింలు జగన్మోహనరెడ్డి ఉచ్చులో పడవద్దని కోరారు. ఈసమావేశంలో టీడీపీ కౌన్సిలర్‌ ఇస్మాయిల్‌, బాహుద్దీన, రాజేంద్ర నాయుడున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 17 , 2025 | 12:05 AM