తొలిపూజకు వేళాయె..
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:48 AM
చవితి వేడుకలకు జిల్లా ముస్తాబైంది. గణనాథుడిని కొలువుదీర్చే మండపాలను మంగళవారానికే సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల్లో సినిమా తరహాలో భారీ సెట్టింగులతో గణేష్‌చతుర్థి వేడుకలకు ఏర్పాట్లను చేశారు. పండుగ నేపథ్యంలో ..
నేడు వినాయక చవితి
అనంతపురం టౌన, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): చవితి వేడుకలకు జిల్లా ముస్తాబైంది. గణనాథుడిని కొలువుదీర్చే మండపాలను మంగళవారానికే సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల్లో సినిమా తరహాలో భారీ సెట్టింగులతో గణేష్‌చతుర్థి వేడుకలకు ఏర్పాట్లను చేశారు. పండుగ నేపథ్యంలో విగ్రహాలు, పూజాసామగ్రి కొనుగోళ్లతో మార్కెట్‌లు కిక్కిరిశాయి. దీంతో నగరం, పట్టణాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పండుగ నేపథ్యంలో పూల ధరలకు రెక్కలొచ్చాయి. సాధారణ రోజుల్లో కిలో రూ.50కి లభించే బంతిపూలు సైతం ఏకంగా రూ.150లకుపైగా పలికాయి.