TDP: పిల్లల ఉన్నతికి తపించేది ఉపాధ్యాయులే
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:35 AM
అనునిత్యం తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పిల్లల ఉన్నతిని కోరుకునేది ఉపాధ్యాయులు మాత్రమే నని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. పట్టణం లోని బీఎస్‌ఆర్ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం ని ర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమానికి పరిటాలశ్రీరామ్ ముఖ్యఅతిథి గా హాజరయ్యారు.
టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్
ధర్మవరం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): అనునిత్యం తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పిల్లల ఉన్నతిని కోరుకునేది ఉపాధ్యాయులు మాత్రమే నని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. పట్టణం లోని బీఎస్‌ఆర్ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం ని ర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమానికి పరిటాలశ్రీరామ్ ముఖ్యఅతిథి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పిల్లలు త ల్లిదండ్రుల కలలను సాకారం చేసేలా పిల్లలు ముందుకెళ్లాల న్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. ఇటీవల ఫ్లోర్‌బాల్ క్రీడలో రాణించి, సింగపూర్‌లో జరిగే పోటీలకు ఎంపి కైన విద్యార్థినులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, చిం తలపల్లి మహేశ, ఫణికుమార్, పరిశే సుధాకర్, సంధా రాఘవ, నాగూర్ హుస్సేన, రాళ్లపల్లి షరీఫ్, చింతపులుసు పెద్దన్న, జింకా పురుషోత్తం, అంబటి సనత, కొత్తపేట ఆది, మాధవ రెడ్డి, చట్టా లక్ష్మీనారాయణ, కరెంటు ఆది, జింకల రాజన్న, భాస్కర్ చౌదరి, గవ్వల నారాయణ స్వామి, రాంపురం శీన, గంగారపు రవి, పల్లపు రవీంద్ర, గిరక నాగేంద్ర, రావుల చెరువు, కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.