SCHOOL: పాఠశాలల్లో వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:45 AM
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిం చడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సత్యకుమార్ సతిమణి త్రివేణి పేర్కొన్నారు. మంత్రి సత్యకుమార్‌యాదవ్ చొరవతో సం స్కృతి సేవాసంస్థ ఆధ్వర్యంలో, హిందూస్థాన కోకాకోలా బేవరేజేస్ కార్పెరేట్ సంస్థ సహకాంతో సీఎస్‌ఆర్ నిధుల ద్వారా పలు పా ఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన టాయిలెట్లను ఆమె సోమవారం ప్రారంభించారు.
మంత్రి సత్యకుమార్ సతీమణి త్రివేణి
ధర్మవరం రూరల్/ బత్తలపల్లి/ముదిగుబ్బ, ఆగస్టు 18(ఆంరఽధజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిం చడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సత్యకుమార్ సతిమణి త్రివేణి పేర్కొన్నారు. మంత్రి సత్యకుమార్‌యాదవ్ చొరవతో సం స్కృతి సేవాసంస్థ ఆధ్వర్యంలో, హిందూస్థాన కోకాకోలా బేవరేజేస్ కార్పెరేట్ సంస్థ సహకాంతో సీఎస్‌ఆర్ నిధుల ద్వారా పలు పా ఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన టాయిలెట్లను ఆమె సోమవారం ప్రారంభించారు. ధర్మవరం పట్టణంలోని బీసీ బాలుర వసతిగృహం, మండలంలోని గొట్లూరు జిల్లా పరిషత పా ఠశాలలో, బత్తలపల్లిలోని ప్రభుత్వ బాలికల పాఠశాల, మండ లంలోని మాల్యవంతం గ్రామం జిల్లా పరిషత ఉన్నత పాఠశాల లో, ముదిగుబ్బలోని బీసీ బాలికల వసతి గృహం, జిల్లా పరిషత బాలి కోన్నత పాఠశాలలో ఈ టాయిలెట్లను నిర్మించారు. మంత్రి సతీమణి వాటిని ప్రారంభించి మాట్లాడుతూ... ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా మంత్రి కార్యాలయంలో తెలియజేయ వచ్చని తెలిపారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ నియోజకవర్గ ఇన చార్జ్ హారీష్‌బాబు, మార్కెట్‌యార్డు చైర్‌పర్సన అరుణశ్రీ, ప్రాజెక్టు కోఆర్డినేటర్ వినయ్ ఆయా మండలాల స్థానిక నాయకులు పాల్గొన్నారు.