CANAL: ఇరిగేషన కాలువలో పెరిగిన ముళ్లకంపలు
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:35 PM
పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురం లో ఉన్న ఇరిగేషన కాలువ కంపచెట్లతో నిండి, పూడిపోయింది. దీనికి తో డు కాలువలోకి వర్షపు నీరు రాకుండా కొందరు దిబ్బలు వేశారు. మరి కొందరు ఆక్రమంగా కట్టడాలు కట్టారు. దీంతో వర్షాకాలం వచ్చిందంటే ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరు కాలనీలో ఉన్న ఈ కాలువలోకి రా కుండా అక్రమణలు అడ్డుగా ఉన్నాయి. దీనికితోడు కాలువలో ముళ్లకంప లు పెరిగిపోయాయి.
కాలువలో నీరు పారేదెలా..?
కంపచెట్లతో పూడి పోయిన కాలువ
ఆక్రమణలతో కుంచించుకుపోయిన వైనం
వర్షం వస్తే ఇళ్లలోకి వస్తున్న నీరు
శాశ్వత పరిష్కారం చూపాలి: స్థానికులు
ధర్మవరం, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురం లో ఉన్న ఇరిగేషన కాలువ కంపచెట్లతో నిండి, పూడిపోయింది. దీనికి తో డు కాలువలోకి వర్షపు నీరు రాకుండా కొందరు దిబ్బలు వేశారు. మరి కొందరు ఆక్రమంగా కట్టడాలు కట్టారు. దీంతో వర్షాకాలం వచ్చిందంటే ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరు కాలనీలో ఉన్న ఈ కాలువలోకి రా కుండా అక్రమణలు అడ్డుగా ఉన్నాయి. దీనికితోడు కాలువలో ముళ్లకంప లు పెరిగిపోయాయి. ఈ రెండు కారణాల వల్ల వర్షపు నీరంతా కాలువకు దగ్గరలో ఉన్న నివాస గృహాల్లోకి చేరుతోంది. దీంతో కాలనీవాసులు వర్షం వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడమే గాకుండా, రోడ్డుకు అడ్డంగా ఇళ్లు నిర్మించుకున్నారు.
దీంతో ప్రతి ఏడాది వర్షాకాలంలో వంకలకు వరద పోటెత్తడం, ఇళ్లు మునగడం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితి దాదా పు 15ఏళ్ల నుంచి కాలనీలో ఉంది. అయితే వరద సమస్యకు శాశ్వత పరి ష్కారం చూనే దిశగా చర్యలు చేపట్టిన పాపాన పోలేదు. కనీసం ఇరిగే షన కాలువలో పెరిగిన ముళ్లకంపలను తొలగిస్తే సమస్య కొంచెమైన తగ్గు తుందని స్థానికులు వా పోతున్నారు. ఇరిగేషన కాలువ వద్ద ఆక్రమణల ను తొలగించి వెడెల్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటు న్నారు. ప్రతియేటా వర్షాకాలం వచ్చిందంటే భయంభయంగా కాలం నెట్టుకొస్తున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆక్రమణల వల్లే... - గురుప్రసాద్, జేఈ, ఇరిగేషన
లక్ష్మీచెన్నకేశవపురంలోని ఇరిగేషన కాలువ ముళ్లకంపలతో నిండిపో యింది. అయితే దాని వల్లనే వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతోందనడం అవాస్తవం. వర్షాలు వచ్చినప్పుడు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరు కాలువలోకి వెళ్లకుండా అడ్డంగా వేసిన దిబ్బలు, అక్రమ కట్టడాలే నీరు ఇళ్లలోకి వెళ్లేందుకు ప్రధాన కారణం. కాలువలో ఏపుగా పెరిగిన కంపచెట్లను తొలగించడానికి నిధుల కోసం ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే కాలువలో పెరిగిన కంపచెట్లను తొలగిస్తాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....