Share News

INSPECTION: ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

ABN , Publish Date - Aug 27 , 2025 | 12:03 AM

పట్టణంలోని ఎరువుల దుకాణాలపై మంగళవారం విజిలెన్స అధికారులు దాడు లు నిర్వహించారు. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న ఫర్టి లైజర్‌ దుకాణాలను విజిలెన్స ఎస్‌ఐ గోపాలుడు, అధికారులు శ్రీని వాసులు, డీసీటీఓ సురేష్‌కుమార్‌ ఏఓ ముస్తఫాతో కలిసి అకస్మిక తనిఖీలు చేశారు.

INSPECTION: ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
Officials conducting inspections at Mudigubba

ధర్మవరం రూరల్‌, ఆగస్టు 26(ఆంరఽధజ్యోతి): పట్టణంలోని ఎరువుల దుకాణాలపై మంగళవారం విజిలెన్స అధికారులు దాడు లు నిర్వహించారు. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న ఫర్టి లైజర్‌ దుకాణాలను విజిలెన్స ఎస్‌ఐ గోపాలుడు, అధికారులు శ్రీని వాసులు, డీసీటీఓ సురేష్‌కుమార్‌ ఏఓ ముస్తఫాతో కలిసి అకస్మిక తనిఖీలు చేశారు. ఈ దుకాణాల్లో నిల్వలో ఉన్న వ్యత్యాసం వల్ల రూ.10,63,000లక్షల విలువైన 3.95టన్నుల ఎరువుల విక్రయాలు నిలుపుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా గొట్లూ రు, పోతుకుంట రైతుసేవా కేంద్రాలలో ఎరువుల నిల్వలను అధికా రులు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు రాజశేఖర్‌, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

ముదిగుబ్బ: వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్‌ శాఖల అధికా రులు మంగళవారం మండలంలోని ఎరువుల దుకాణాల్లో తనిఖీ లు చేశారు. మండల కేంద్రంలోని రెండు ఎరువుల దుకాణాల్లో స్టాకు వ్యత్యాసం కారణంగా రూ.17,84,210 విలువ చేసే ఎరువుల విక్ర యాలను నిలిపి వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కదిరి ఏడీఏ సనావుల్లా, ముదిగుబ్బ తహసీల్దార్‌ నారాయణస్వామి, మండల ఏఓ రవీంద్ర, పోలీసు అధికారులు పాల్గొన్నారు.


నల్లమాడ: మండలంలోని రెడ్డిపల్లిలో ఉన్న ఎరువుల దుకా ణాన్ని తహసీల్దార్‌ రంగనాయకులు, ఏఓ అబ్దుల్‌హక్‌ మంగళ వారం తనిఖీ చేశారు. దుకాణంలో నిలువున్న స్టాక్‌ను, రికార్డులను పరిశీలించారు. రైతు సేవా కేంద్రాల్లో యూరియాతో పాటు ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.

తాడిమర్రి: మండల కేంద్రంలోని రెండు ఎరువుల దుకాణా లను తహసీల్దార్‌ భాస్కర్‌రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లో యూరియా నిల్వలను, ధరలను పరిశీ లించా రు. కార్యక్రమంలో రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Aug 27 , 2025 | 12:03 AM