Share News

JC: తహసీల్దార్‌ కార్యాలయం పరిశీలన

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:09 AM

స్థానిక తహసీల్దార్‌ కార్యాల యాన్ని మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ పరిశీలించారు. కార్యాల యంలోని రికార్డులు, మ్యుటేషన ఫైల్స్‌, రెవె న్యూ రిజిస్టర్లను పరిశీలించారు. పెడబల్లిలో నిర్వహిస్తున్న భూ రీసర్వేపై సిబ్బందితో సమీ ించారు. తప్పులు లేకుండా రెవెన్యూ రికార్డు లను తయారు చేయాలని ఆదే శించారు.

JC: తహసీల్దార్‌ కార్యాలయం పరిశీలన
JC checking the records in the Tehsildar's office

నంబులపూలకుంట, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక తహసీల్దార్‌ కార్యాల యాన్ని మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ పరిశీలించారు. కార్యాల యంలోని రికార్డులు, మ్యుటేషన ఫైల్స్‌, రెవె న్యూ రిజిస్టర్లను పరిశీలించారు. పెడబల్లిలో నిర్వహిస్తున్న భూ రీసర్వేపై సిబ్బందితో సమీ ించారు. తప్పులు లేకుండా రెవెన్యూ రికార్డు లను తయారు చేయాలని ఆదే శించారు. స్వామిత్వా, గ్రామ కంఠాల రీసర్వే తప్పకుండా చేయాలని ఎంపీడీఓ పార్థసా రథి, పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతర కార్యా లయం గదులను పరిశీలిం చారు. పైకప్పు పెచ్చులూడడం, గదులు సరిగా లేకపోవడంతో మరమ్మతులపై తహసీల్దార్‌ దేవేంద్రనాయక్‌ను అడిగి తెలు సుకున్నారు. సోలార్‌ సీఎస్‌ఆర్‌ నిధులు మంజూరయ్యాయని, అయినా పనులు ఎందుకు చే పట్టలేదని ఏపీఎస్‌పీసీఎల్‌ సో లార్‌ అధికారులను ప్రశ్నించారు. వెంటనే ప నులు చేపట్టాలని ఆదేశించారు. మరమ్మ తుల సమయంలో తహసీల్దార్‌ కార్యాలయా న్ని సచివాలయంలోకి మార్చాలని సూచిం చారు. ప్రభుత్వ భూముల వివరాలను ఆ యన తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోలార్‌హబ్‌ను పరిశీలించారు. ఆయనతోపాటు ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ, కార్యాల యం సిబ్బంది పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 17 , 2025 | 12:09 AM