APD: బ్లాక్ ప్లాంటేషన పనుల పరిశీలన
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:20 AM
మండల పరిధిలోని ఓరువాయి గ్రామ పంచాయతీ కుమ్మరవాండ్లపల్లి ఆంజనేయస్వా మి ఆలయ భూముల్లో బ్లాక్ ప్లాంటేషనలో భాగంగా 110 మామి డి, టెంకాయ, అల్లినేరేడు మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహిం చారు. ఏపీడీ శకుంతల మంగళవారం కార్యక్రమాన్ని పరిశీలించి, మొక్కలు నాటారు.
నల్లచెరువు, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని ఓరువాయి గ్రామ పంచాయతీ కుమ్మరవాండ్లపల్లి ఆంజనేయస్వా మి ఆలయ భూముల్లో బ్లాక్ ప్లాంటేషనలో భాగంగా 110 మామి డి, టెంకాయ, అల్లినేరేడు మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహిం చారు. ఏపీడీ శకుంతల మంగళవారం కార్యక్రమాన్ని పరిశీలించి, మొక్కలు నాటారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు పండ్ల మొక్కల పెంపకం పథకాలను సద్వినియోగం చేసుకోవా లని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మంజునాథ్, ఈసీ సుబ్బారెడ్డి, టి. రమేష్, టీడీపీ నాయకులు దేవేంద్రగౌడ్, సతీష్‌నాయుడు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.