TEACHERS: ఇనసర్వీస్ టీచర్లకు బదిలీల్లో అవకాశమివ్వాలి
ABN , Publish Date - May 25 , 2025 | 12:06 AM
ఉపాధ్యాయుల బదిలీల్లో ఇనసర్వీస్ బీఈడీ టీచర్లకు అవకాశం కల్పించాలని ఎంఈఎఫ్ నాయకు లు డిమాండ్ చేశారు. శనివారం ఆ సంఘం జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ ఇతర నాయుకులు డీఈఓ ప్రసాద్‌బాబును కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎస్‌జీటీలుగా పనిచే స్తూ.. ఇనసర్వీస్‌లో బీఈడీ కోర్సు చాలా మంది టీచర్లు చేస్తున్నారన్నారు.
- డీఈఓకు ఎంఈఎఫ్ నాయకుల వినతి
అనంతపురం విద్య, మే 24(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీల్లో ఇనసర్వీస్ బీఈడీ టీచర్లకు అవకాశం కల్పించాలని ఎంఈఎఫ్ నాయకు లు డిమాండ్ చేశారు. శనివారం ఆ సంఘం జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ ఇతర నాయుకులు డీఈఓ ప్రసాద్‌బాబును కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎస్‌జీటీలుగా పనిచే స్తూ.. ఇనసర్వీస్‌లో బీఈడీ కోర్సు చాలా మంది టీచర్లు చేస్తున్నారన్నారు. అయితే 2023-2025 బ్యాచ టీచర్లు మాత్రమే బదిలీకి దరఖాస్తు చేసే వెసలుబాటు ఇచ్చారన్నారు. 2024-26 బ్యాచ టీచర్లకు అవకాశం ఇవ్వక పోవడంతో వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. వీరిలో కూడా చాలా మంది 2016లో నుంచి మారుమూల ప్రాంతాల్లో తొమ్మిదేళ్ల పాటు పనిచేసిన వారు ఉన్నారన్నారు. అయితే అలాంటి వాళ్లకు ఈ బదిలీల్లో అవకాశం ఇవ్వకపోవడంతో 1977 నుంచి ఇన సర్వీస్ ఎస్సీ, ఎస్టీ టీచర్ల ఆనడ్యూటీ సౌకర్యాన్ని ప్రభుత్వమే నీరుగార్చినట్టు అవుతుందన్నారు. ఆ వర్గం టీచర్ల సమస్యను దృష్టిలో ఉంచుకుని వాళ్లకు బదిలీల్లో దరకాస్తు చేసుకోడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు డీఈఓకు వినతిపత్రం అందించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....