PD: మౌలిక వసతులు మెరుగ్గా ఉండాలి
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:45 AM
జిల్లాలోని అన్ని అంగనవాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, లేక పోతే చర్యలు తప్పవని ఐసీడీఎస్ పీడీ ప్రమీల అంగన్వాడీ కార్య కర్తల కు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో శనివా రం అంగనవాడీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
అంగనవాడీ కార్యకర్తలకు ఐసీడీఎస్ పీడీ సూచన
పుట్టపర్తి రూరల్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని అంగనవాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, లేక పోతే చర్యలు తప్పవని ఐసీడీఎస్ పీడీ ప్రమీల అంగన్వాడీ కార్య కర్తల కు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో శనివా రం అంగనవాడీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో పీడీ మాట్లాడుతూ... జిల్లాలోని ప్రతి అంగనవాడీ కేంద్రంలో మౌలిక సదుపాయాలైన నీరు, విద్యుత, మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. అలాగే ప్రతికేంద్రం వద్ద మునగ, పాల కూర, పొన్నగంటి, బచ్చలికూర ఖచ్చితంగా పెంచాలని తెలిపారు. అనంతరం వనం- మనం కార్యక్రమంలో భాగంగా కార్యాలయం ఎదుట ఉసిరిమొక్క నాటారు. కార్యక్రమంలో సీడీపీఓ జయంతి, సూపర్వైజర్‌లు సుజాత, పుష్ప, భారతి, రజిత, అంగన్వాడీ కార్యకర్తలు, నాగమణి, సుజాత, ఉషా పద్మకుమారి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....