MLA: జీఎస్టీ తగ్గింపుపై తెలియజేయండి
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:03 AM
జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అందరికీ తెలియజేయాలని ప్రభు త్వ ఉద్యోగులు, పార్టీ నాయకులను ఎమ్మెల్యే కంది కుంట వెంకట్రపసాద్ కోరారు. స్థానిక 33వ వా ర్డులో తలపుల మండలం కురుగుట్టపల్లెలో ఆయన బుధవారం పింఛన్లు పంపిణీ చేశారు. అనం త రం ఎమ్మెల్యే మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని వర్గాల ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు అందుతున్నా య న్నారు.
ఎమ్మెల్యే కందికుంట
కదిరి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అందరికీ తెలియజేయాలని ప్రభు త్వ ఉద్యోగులు, పార్టీ నాయకులను ఎమ్మెల్యే కంది కుంట వెంకట్రపసాద్ కోరారు. స్థానిక 33వ వా ర్డులో తలపుల మండలం కురుగుట్టపల్లెలో ఆయన బుధవారం పింఛన్లు పంపిణీ చేశారు. అనం త రం ఎమ్మెల్యే మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని వర్గాల ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు అందుతున్నా య న్నారు. ఈ విషయాలను పార్టీ నాయకులు, అధికా రులు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. జీ ఎస్టీ తగ్గింపుతో ప్రజలకు మేలు కలగడమే కాకుం డా వ్యాపారాలు ఊపందుకుంటాయని అన్నారు. హంద్రీ నీవా ద్వారా తలుపుల మండలంలోని అన్ని చెరువులకు నీరందిస్తామని తెలిపారు. కాలువ లైనింగ్ పనులు త్వరలో చేపడతారని తెలిపారు. సామాజిక బాధ్యత కింద ప్రభుత్వం పింఛన్లు ఆందజేస్తోందని పేర్కొన్నారు. అనర్హుల పింఛన్లు తొలగిస్తే అందుకు వైసీపీ నాయకులు గగ్గోలు పెట్టారని తెలిపారు. అనర్హులకు పింఛన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పరిశీలకులు వాజీద్, రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన డైరెక్టర్ పర్వీన బాను, మున్సిపల్ చైర్‌పర్సన దిల్షాద్ ఉన్నీసా, వార్డు కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పా ల్గొన్నారు. అలాగే ఆయన తలుపు ల మండలంలో హంద్రీ-నీవా కాలవను , కొండారెడ్డి చెరువుకు నీరు పారే కాలువులను పరిశీలించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....