FARMER: పాడిరైతులకు తప్పని కష్టాలు
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:02 AM
కరువు ప్రాంతమైన అమడగూరు మండలంలో వ్యవసాయంతో రైతులు ప్రతి యేటా నష్టాలు చవి చూస్తున్నారు. దీంతో పె ట్టుబడులు పెట్టి పంటలు సాగుచేయలేక, పంటలు సాగిచేసినా పెట్టుబడులు తిరిరాని పరిస్థితిలో కొట్టుమిట్టాడు తున్నారు. దీంతో చాలామంది రైతులు రైతులు పాడిపరిశ్రమపై మక్కువ చూపుతున్నారు. ఎవరి శక్తి వారు రెండు లేదా నాలుగు ఆవులు, గేదెలు పెట్టుకొని పాలవ్యాపారం చేస్తున్నారు.
పశు వైద్యశాలల్లో కనిపించని వైద్యులు
అమడగూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కరువు ప్రాంతమైన అమడగూరు మండలంలో వ్యవసాయంతో రైతులు ప్రతి యేటా నష్టాలు చవి చూస్తున్నారు. దీంతో పె ట్టుబడులు పెట్టి పంటలు సాగుచేయలేక, పంటలు సాగిచేసినా పెట్టుబడులు తిరిరాని పరిస్థితిలో కొట్టుమిట్టాడు తున్నారు. దీంతో చాలామంది రైతులు రైతులు పాడిపరిశ్రమపై మక్కువ చూపుతున్నారు. ఎవరి శక్తి వారు రెండు లేదా నాలుగు ఆవులు, గేదెలు పెట్టుకొని పాలవ్యాపారం చేస్తున్నారు. డెయిరీలకు పాలు పోస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలంలో రెండు పశువైద్యశాలలు ఉన్నాయి. అయితే వాటి వద్దకు ఎప్పుడు వెళ్లినా పశు వైద్యులు కనపడరు. దీంతో మండల ప్రజలు పశు వైద్యం గురించి ఎవరిని అడగాలో తెలియన అయోమయ స్థితిలో పడాల్సిన పరిస్థితి నెలకొంది. మండకేంద్రంలోని పశు వైద్యులు ధనుంజయులు బదిలీపై వెళ్లారు. దీంతో తనకల్లు మండలంలోని బొంతలపల్లి పశవైద్య కేంద్రం పశువైద్యులు హరినాథ్‌రెడ్డి ఇనచార్జ్ వైద్యుడిగా ఇక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆయన వారంలో ఒక రోజు అమడగూరుకు వచ్చి వెళుతుంటారని రైతులు తెలిపారు. దీంతో పశువులకు ఏ వ్యాధి వచ్చినా ప్రైవేటుగా మందులు కొనాల్సిందే. పశువైద్యశాలకు వెళ్లి మందు లు అడిగితే ఇంటికి ఇచ్చేందుకు కుదరదు, ఇక్కడికే పశువులను తీసుకొస్తే మందులు ఇచ్చి చూస్తామని సిబ్బంది చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. మండల వ్యాప్తంగా ఆవులు 5403, గేదెలు 346, గొర్రెలు 57675, మేకలు 9280, ఇతర పశువులు 1570 ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబు తున్నాయి. వీటికి సేవలు అందించేందుకు పంచాయతీకి ఒకరు చొప్పున వెటర్నరీ అసిస్టెంట్‌ను నియమిం చారు. అయితే డబ్బులు చెల్లిస్తే తప్ప వారు వైద్యం అందించరనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. మండలంలో పశువైద్యంపై ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు అంటున్నారు. వైద్యులను నియమించి అన్ని వేళలా అందుబాటులో ఉండేలా చూడాలని పాడి రైతులు కోరుతున్నారు.
పశువైద్యుడిని ఏర్పాటు చేస్తాం - కేశవయ్య, ఏడీ
డాక్టర్ లేనిది వాస్తవమే, పంచాయతీకొక వెటర్నరీ అసిస్టెంట్ ఉన్నా రు. ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు, వైద్యుడిని కూడా ఏర్పాటు చేసి పాడి రైతులకు అవసరమ్యే మందులు అందించి ఇబ్బంది లేకుండా చూస్తాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....