MINISTERS: డ్వాక్రా బజార్ పోస్టర్ల ఆవిష్కరణ
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:20 AM
సత్యసాయి శత జయంతి వేడుకల సందర్భంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యలో అఖిల భారత డ్వాక్రా బజార్ -2025 ప్రచార వాల్ పో స్టర్లను మంగళవారం స్థానిక శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రుల బృందం ఆవిష్కరించింది.
పుట్టపర్తి టౌన, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): సత్యసాయి శత జయంతి వేడుకల సందర్భంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యలో అఖిల భారత డ్వాక్రా బజార్ -2025 ప్రచార వాల్ పో స్టర్లను మంగళవారం స్థానిక శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రుల బృందం ఆవిష్కరించింది. రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్, వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, వెనుకడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి సవిత, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొ న్నారు. అలాగే రాష్ట్ర రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎండీ కృష్ణబాబు, రాష్ట్ర పర్యాటక యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన, కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్, జేసీ మౌర్యభర ద్వాజ్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు. కాగా ఈనెల 15 నుంచి 25 వరకు స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ కళాకారులు తయారుచేసిన చేనేత హస్తకళలు, ఆహార ఉత్పత్తుల అమ్మకాల కోసం డ్వాక్రా బజారులో స్టాల్లు ఏర్పాటు చేయనున్నారు.. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ, జిల్లా పర్యాటక ఇనచార్జి అధికారి నరసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.