Share News

SPORTS: జోనల్‌ స్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీల్లో జిల్లా జట్టుకు రెండో స్థానం

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:06 AM

తిరుపతి నగరంలో మూడు రోజులుగా నిర్వహించిన బాస్కెట్‌బాల్‌ అమరావతి చాంపియనషిప్‌ పోటీల్లో జిల్లా బాలికల జట్టు ద్వితీయస్థానంలో నిలిచినట్టు ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన సెక్రటరీ శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికారక సంస్థ(సాప్‌) ఆధ్వర్యంలో జాతీ య క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల18,19,20 తేదీలలో అమరావతి చాంపియనషిప్‌ జోనల్‌ స్థాయి పోటీలు నిర్వహించారన్నారు.

SPORTS: జోనల్‌ స్థాయి బాస్కెట్‌బాల్‌  పోటీల్లో  జిల్లా జట్టుకు రెండో స్థానం
Association representatives with the second placed girls team

ధర్మవరం, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరంలో మూడు రోజులుగా నిర్వహించిన బాస్కెట్‌బాల్‌ అమరావతి చాంపియనషిప్‌ పోటీల్లో జిల్లా బాలికల జట్టు ద్వితీయస్థానంలో నిలిచినట్టు ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన సెక్రటరీ శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికారక సంస్థ(సాప్‌) ఆధ్వర్యంలో జాతీ య క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల18,19,20 తేదీలలో అమరావతి చాంపియనషిప్‌ జోనల్‌ స్థాయి పోటీలు నిర్వహించారన్నారు. ఫైనల్స్‌లో చిత్తూరు జట్టుతో హోరాహోరీగా పోరాడిన జిల్లా బాలికల జట్టు ద్వితీయస్థానంలో నిలిచిందన్నారు. దీంతో గురువారం పట్టణంలోని బాస్కెట్‌బాల్‌ కోర్టులో ఆ బాలికలను శెట్టిపి జయచంద్రారెడ్డితో పాటు ధర్మవరం బాస్కెట్‌బాల్‌ అసోసి యేషన ప్రతినిధులు మేడాపురం రామిరెడ్డి, వాయల్పాడు హిదయ్‌ తుల్లా, కోచ సంజయ్‌ అభినందించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Aug 22 , 2025 | 12:06 AM