OFFICE: తహసీల్దార్ కార్యాలయంలో... పలు స్థానాలు ఖాళీ
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:42 PM
స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ పోస్టు ఖాళీగా ఉండటంతో ఉన్న సిబ్బందిపై పని భారం పెరిగింది. దీంతో ప్రజలకు సేవలు అందించడంలో అలస్యమవు తోంది. అలాగే కార్యాలయంలో ఆర్‌ఐ పోస్టుతో పాటు సీనియర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు కార్యాలయ అధికారులు తెలుపుతున్నారు.
ధర్మవరం రూరల్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ పోస్టు ఖాళీగా ఉండటంతో ఉన్న సిబ్బందిపై పని భారం పెరిగింది. దీంతో ప్రజలకు సేవలు అందించడంలో అలస్యమవు తోంది. అలాగే కార్యాలయంలో ఆర్‌ఐ పోస్టుతో పాటు సీనియర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు కార్యాలయ అధికారులు తెలుపుతున్నారు. ఈ కార్యాలయం పరిధిలో ధర్మవరం పట్టణంతో పాటు మండలంలోని 20 పం చాయతీలు ఉన్నాయి. పట్టణ, రూరల్ పరిధిలో సుమారు 1.70లక్షల జనాభా ఉంది. మండలవ్యాప్తంగా 32,070 రైతుల ఖాతాలు ఉన్నాయి. ఇం తపెద్ద మండలానికి గతంలో ఇద్దరు ఆర్‌ఐలు ఉండే వారు. ప్రస్తుతం ఒక్క ఆర్‌ఐ కూడా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతే గాకుండా భూ సమస్యలు, విద్యార్థుల కుల ధ్రువీకరణ, ఇనకం సర్టిఫికెట్లు, ఫ్యామిలీ మెంబర్, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలకు సంబంధించి ఆర్‌ఐ రిపోర్టు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఆర్‌ఐ పోస్టు సంవత్సరం నుంచి ఖాళీగా ఉంది. గతంలో పనిచేస్తున్న ఆర్‌ఐ రమాదేవి అనంతపురం జిల్లాకు బదిలీ కావడంతో అప్పటి నుంచి ఎవరినీ నియమించలేదని ఆ కార్యాలయంలోని అధికారులు తెలుపుతున్నారు. ఆర్‌ఐ పోస్టు ఖాళీగా ఉండటంతో ఆయా గ్రామాల వీఆర్‌ఓలపై పనిభారం పెరిగిందని, దీంతో సకాలంలో ప్రజలకు సేవలు అంద డంలేదని పలువురు పేర్కొంటున్నారు. అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ పోస్టు కూడా ఖాళీగా ఉండటంతో భూ సమస్యలకు సంబంధించి కోర్టు పెండింగ్ కేసు లన్నీ పేరుకుపోయినట్లు సమాచారం.
ఇంతపెద్ద మం డలానికి సీనియర్ అసిస్టెంట్ లేకపోవడంతో పనులెలా సాగేదని పలువురు అంటున్నారు. ఉన్న సిబ్బంది ద్వా రా పనులు చేయిస్తుండటంతో అలస్యమవుతున్నట్లు తె లుస్తోంది. నియోజకవర్గంలోనే ధర్మవరం పట్టణం, రూ రల్ పరిధికి ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి ప్రధాన పోస్టులు ఖాళీగా ఉండటంతో రైతులకు మెరుగైన సే వలు అందడంలేదన్న వాదన వినిపి స్తోంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆర్‌ఐ, సీనియర్ అసి స్టెంట్ పోస్టులు భర్తీచేసి ప్రజలకు సకాలంలో రెవెన్యూ సేవలు అందించాలని పలువురు కోరుతున్నారు.
ఇనచార్జ్ తహసీల్దారే దిక్కు
ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ నటరాజు రెండు నెలల క్రితం చిల మత్తూరు మండలానికి బదిలీ అయ్యారు. ఇదే కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న సురేష్ బాబుకు ఏఫ్‌ఏసీ కింద తహసీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. అయితే కార్యాలయంలో ఆర్‌ఐ, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండడం, అన్నింటిని తహసీల్దారే చూసు కోవడంతో పాటు ప్రొటోకాల్ ఉంది. పైగా కార్యాలయం డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌ఐ, సిబ్బంది లేకపోవడంతో పనిభారంతో ఆయన అల్లాడిపోతున్నట్లు సమాచారం.
జిల్లా ఉన్నతాధికారులకు నివేదించాం - సురేష్‌బాబు, తహసీల్దార్, ధర్మవరం
కార్యాలయంలో ఆర్‌ఐ, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండటం వాస్తవమే. భూ సమస్యలతో పాటు కోర్టు పెండింగ్ కేసులతో పనిభారం ఎక్కువగా ఉంది. ఆర్‌ఐ, సీనియర్ అసిస్టెంట్‌ల ఖాళీలపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....