OFFICIALS: రోడ్డు విస్తరణకు పైౖపులైన్ల ఆటంకం
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:07 AM
మండల కేంద్రంలోని నాలుగురోడ్లకు ఇరువైపులా రూ. 2కోట్ల వ్యయంతో రోడ్డువిస్తరణ పనులను ఆర్‌అండ్‌బీ అధికారులు చేపట్టారు. అయితే సత్యసాయి బాబా తాగునీటి పైపులైనను గతంలో ఆర్‌అండ్‌బీ స్థలంలోనే వేశారు. ఇప్పుడు రోడ్డు విస్తరణ పనులకు ఆ పైపులైన ఆటంకంగా మారడంతో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సంజీవయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ గంగాధర్, సత్యసాయివాటర్ సప్లై అధికారులు బుధవారం మం డల కేంద్రంలోని ధర్మవరం రహదారిలో పర్యటించారు.
పరిశీలించిన అధికారులు
కొత్తచెరువు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని నాలుగురోడ్లకు ఇరువైపులా రూ. 2కోట్ల వ్యయంతో రోడ్డువిస్తరణ పనులను ఆర్‌అండ్‌బీ అధికారులు చేపట్టారు. అయితే సత్యసాయి బాబా తాగునీటి పైపులైనను గతంలో ఆర్‌అండ్‌బీ స్థలంలోనే వేశారు. ఇప్పుడు రోడ్డు విస్తరణ పనులకు ఆ పైపులైన ఆటంకంగా మారడంతో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సంజీవయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ గంగాధర్, సత్యసాయివాటర్ సప్లై అధికారులు బుధవారం మం డల కేంద్రంలోని ధర్మవరం రహదారిలో పర్యటించారు. పైపులైన ను పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ స్థలంలో ఉన్న పైప్‌లైనను తొలగిం చాలని, లేకపోతే ఎక్కువ లోతులో ఏర్పాటుచేసుకోవాలని ఆర్ డబ్ల్యూఎస్, సత్యసాయి వాటర్ సప్తై అధికారులకు ఆర్‌అండ్‌బీ అధికారులు తెలియజేశారు. అయితే తాగునీటి పైపులైన లోతుగా వేయడం వల్ల ఎప్పుడైనా పైపులైన పగిలిపోతే రోడ్డును తవ్వాల్సి వస్తుందని, అప్పుడు రోడ్డు దెబ్బతినే అవకాశం ఉందని ఆర్‌అడబ్ల్యూఎస్, సత్యసాయి వాటర్ సప్తై అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని ఆయన సూచన మేరకు వ్యవహరిస్తామని వారు తెలిపారు.