MLA: కష్టపడి పనిచేస్తే ఫలితం ఖాయం
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:03 AM
కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ఎమ్మెల్యే పల్లె సిం ధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మహమ్మదాబాద్ మిషన కార్యాలయం ఆవరణంలో బుధవారం ఏర్పాటు చేసిన సింగల్‌విండో అధ్యక్షుడిగా జనసేన నాయకుడు కమ్మల నరేష్, డైరెక్టర్లుగా చంద్రశేఖర్, నరసింహులు ప్రమాణ స్వీకరానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఎమ్మెల్యే సింధూరరెడ్డి
అమడగూరు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ఎమ్మెల్యే పల్లె సిం ధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మహమ్మదాబాద్ మిషన కార్యాలయం ఆవరణంలో బుధవారం ఏర్పాటు చేసిన సింగల్‌విండో అధ్యక్షుడిగా జనసేన నాయకుడు కమ్మల నరేష్, డైరెక్టర్లుగా చంద్రశేఖర్, నరసింహులు ప్రమాణ స్వీకరానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందన్నారు. పనిచేసిన వారికి పదవులు ఇస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా నేరవేరుస్తూ ముందడుగు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఇనచార్జ్ పత్తి చంద్రశేఖర్, బీజేపీ నాయకులు శరతకుమార్‌రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ గోపాల్‌రెడ్డి, లాయర్ రాజశేఖర్, క్రిష్ణమూర్తి, శ్యామ్‌బాబునాయుడు, నాగేం ద్రరెడ్డి, పాల శీనా, సిద్దు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పేదలను ఆదుకుంటున్నాం
పుట్టపర్తిరూరల్: రాష్ట్రం ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఆర్థికంగా ఆదుకుంటోందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే బుధవారం జిల్లాకేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఉపాధి హామీ అభివృద్ది పనులపై క్షేత్రస్థాయి అధికారులు, ఉపాది హామీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. మాజీ మంత్రి పల్లె రఘనాథరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మా ట్లాడుతూ... గత వైసీపీ ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం ఆర్థికస్థితి సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నా ప్రస్తుతం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు ప్రజలకిచ్చిన హామీమేరకు అభివృద్ధి సంక్షే మాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తోందన్నారు. 2014-2022 వరకు నియోజకవర్గంలో నిలిచి పోయిన అభివృద్ధిపనులకు సంబందించి రూ. 1,30,65,000 నిధులను కేంద్ర ప్రభుత్వ సహకారంతో విడుదల చేసిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన అవసరం అధికా రులపై ఉందని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత అదికారులు, సిబ్బంది, పలువురు రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....