Share News

CEO: ఇలా ఉంటే రోగాలు రావా..?

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:30 AM

మండలంలోని చిగిచెర్ల గ్రామంలో శుక్రవారం ఉమ్మడి జిల్లాల జడ్పీ సీఈఓ శివశంకర్‌ పర్యటిం చారు. రోడ్డుపై మురుగునీటి నిల్వ, చెత్త దిబ్బలు ఉండటంతో... ఇలా ఉం టే రోగాలు రావా అని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ప్రజలతో మాట్లాడుతూ... ఇళ్ల్ద నుంచి రోడ్డుపైకి నీరు వదలకూ డదని, ఇంటివద్దే సోపిట్‌ ఏర్పాటుచేసుకోవాలన్నారు.

CEO: ఇలా ఉంటే రోగాలు రావా..?
సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్న జడ్పీ సీఈఓ శివశంకర్‌

చిగిచెర్ల పర్యటనలో జడ్పీ సీఈఓ అసహనం

ధర్మవరంరూరల్‌, అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిగిచెర్ల గ్రామంలో శుక్రవారం ఉమ్మడి జిల్లాల జడ్పీ సీఈఓ శివశంకర్‌ పర్యటిం చారు. రోడ్డుపై మురుగునీటి నిల్వ, చెత్త దిబ్బలు ఉండటంతో... ఇలా ఉం టే రోగాలు రావా అని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ప్రజలతో మాట్లాడుతూ... ఇళ్ల్ద నుంచి రోడ్డుపైకి నీరు వదలకూ డదని, ఇంటివద్దే సోపిట్‌ ఏర్పాటుచేసుకోవాలన్నారు. ప్రతిరోజు పంచా యతీ సిబ్బంది గ్రామంలో తిరిగి పారిశుద్ద్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో చెత్తాసేకరణ కేంద్రాన్ని పరిశీలించారు. చెత్త నుంచి సంపదే లక్ష్యంగా గ్రామంలోని చెత్తాచెదారాన్ని కేంద్రానికి తరలించాలని కార్మికులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ సాయిమనోహర్‌, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేష్‌, సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు జడ్పీ మాజీ చైర్మన ఓబిరెడ్డి, పార్థారెడ్డి, గణేష్‌రెడ్డి, చండ్రాయుడు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ హేమంత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 12:30 AM