RAIN: వాగు పారితే విద్యుత సరఫరా అంతే..!
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:07 AM
సమీపంలోని వాగు ప్రవహిస్తే మండల కేంద్రంలోని విద్యుత సబ్‌స్టేషనలోకి నీరువస్తాయి. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో కదిరి - రాయచోటి రోడ్డు వద్ద వాగు పక్కన విద్యుత సబ్ స్టేషన నిర్మించారు. గతంలో భారీ వర్షా ల కారణంగా సబ్‌స్టేషనలోకి నీరు చేర డంతో విద్యుత అంతరాయం ఏర్పడింది. అయితే ఇప్పటివరకు సబ్‌స్టేషనలోకి వాగు నీరు ప్రవహించకుండా ఎలాంటి ప్రహరీ నిర్మించలేదు.
గాండ్లపెంట, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): సమీపంలోని వాగు ప్రవహిస్తే మండల కేంద్రంలోని విద్యుత సబ్‌స్టేషనలోకి నీరువస్తాయి. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో కదిరి - రాయచోటి రోడ్డు వద్ద వాగు పక్కన విద్యుత సబ్ స్టేషన నిర్మించారు. గతంలో భారీ వర్షా ల కారణంగా సబ్‌స్టేషనలోకి నీరు చేర డంతో విద్యుత అంతరాయం ఏర్పడింది. అయితే ఇప్పటివరకు సబ్‌స్టేషనలోకి వాగు నీరు ప్రవహించకుండా ఎలాంటి ప్రహరీ నిర్మించలేదు. కనీసం వాగును దారి మళ్లించే ప్రయత్నాలు జరగలేదు. సబ్‌స్టేషనలో నిరంతరం విద్యుత హైవో ల్టేజీ ఉంటుంది. దీంతో వాగు ప్రవహిస్తే విద్యుత అంతరాయం తప్పదని ప్రజలు అంటున్నారు. దీనిపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నిస్తు న్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వాగు నీరు సబ్‌స్టేషనలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....